S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/08/2018 - 05:58

కొమరాడ, అక్టోబర్ 7: మండలంలోని జాతీయ రహదారిలో కోటిపాం- గుమడ మధ్యలో గల రాళ్లగెడ్డ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయలైన సంఘటన వెలుగుచూసింది.

10/08/2018 - 05:17

కొత్తూరు రూరల్, అక్టోబర్ 7: న్యాయవిద్య విద్యార్థి అదృశ్యమైన ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.

10/08/2018 - 02:10

తాడికొండ, అక్టోబర్ 7: మండల పరిధిలోని నిడుముక్కల గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు.

10/08/2018 - 22:01

పాతబస్తీ, అక్టోబర్ 7: మద్యం మత్తులో వీరంగం సృష్టించి కానిస్టేబుల్‌పై సైతం దాడి చేసిన కేసులో నిందితుడు బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు దేవరకొండ నాగరాజు (23) ఆదివారం సాయంత్రం భవానీపురం పోలీసు స్టేషన్‌లో బ్లేడ్‌తో పీక, పొట్ట భాగంలో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

10/08/2018 - 01:23

కందుకూరు, అక్టోబర్ 7: భార్య మరణించిందనే మనస్థాపంతో నాగరాజు (35) అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని పంటవారిపాలెం దగ్గర ఓవి రోడ్డుపై ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సింగరాయకొండ మండలం శాణంపూడికి చెందిన కె నాగరాజు భార్య, పిల్లలు హైదరాబాద్‌లో బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని తెలిపారు.

10/08/2018 - 01:19

ముజఫర్‌నగర్, అక్టోబర్ 7: ఇరవై నాలుగేళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మజఫర్‌నగర్ జిల్లా భూదాన పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకెళితే..శనివారం నాడు బాధిత మహిళ తన గ్రామానికి తిరిగి వెళ్లేందుకు బస్‌కోసం వేచివుండంగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామంటూ మభ్యపెట్టి బైక్‌మీద ఎక్కించుకున్నారు.

10/08/2018 - 01:18

పాట్నా, అక్టోబర్ 7: తమను లైంగికంగా వేధించేందుకు వచ్చిన ఆకతాయిలకు బడితపూజ చేశారన్న ఉక్రోషంతో కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై సామూహికంగా దాడి చేసిన ఘటన ఆదివారం బీహార్‌లో చోటుచేసుకుంది. ఊరికి దూరంగా సరైన రక్షణ ఏర్పాట్లు లేని ఈ పాఠశాల విద్యార్థినులపై గుంపు దాడికి పాల్పడగా సుమారు 30 మంది విద్యార్థినులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

10/08/2018 - 00:44

రాజవొమ్మంగి, అక్టోబర్ 7: గుజరాత్ రాష్ట్రం సూరత్ నిట్‌లో బీటెక్ చదువుతున్న రాజవొమ్మంగి విద్యార్థి సూరత్‌కు 120 కి.మీ. దూరాన ఉన్న గిర వాటర్ ఫాల్స్‌లో పడి మృతిచెందిన సంఘటన మండలంలో విషాదం నింపింది. రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కనిగిరి సాయిప్రవీణ్ శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరణించాడు. సాయి ప్రవీణ్ కంప్యూటర్ సైన్సు మూడో సంవత్సరం చదువుతున్నాడు.

10/08/2018 - 00:33

కాకినాడ సిటీ, అక్టోబర్ 7: జులాయిగా తిరిగే ఓ ఆకతాయి స్వల్ప వివాదం కారణంగా ఇద్దరు సోదరులపై చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం డ్రైవర్స్ కాలినీలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి కాకినాడ రూరల్ సీఐ ఎ రాంబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

10/08/2018 - 01:33

కందుకూరు: కారు అపహరణ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఉలవపాడులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనపై ఆదివారం స్థానిక డీఎస్పీ ప్రకాశరావు తెలిపిన వివరాల ప్రకారం- నెల్లూరు జిల్లా కావలికి చెందిన సిహెచ్ వెంకటయ్య కారు అద్దెలకు పంపేవాడు. ఈ కారుకు సిహెచ్ సంతోష్ డ్రైవర్‌గా ఉండేవాడు.

Pages