S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/08/2018 - 22:45

హిందూపురం, ఏప్రిల్ 8 : హిందూపురం రూరల్ మండల పరిధిలోని జంగాలపల్లి వద్ద హంద్రీనీవా కాలువలో ఈత కోసం వచ్చిన ఓ యువకుడు తోటి స్నేహితుల ఎదుటే ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటు చేసుకొంది. ఆదివారం మధ్యాహ్నం సోమందేపల్లి మండలం నడింపల్లికి చెందిన కొందరు నాయకులు ఈత కోసం జంగాలపల్లి వద్దకు వచ్చారు. హంద్రీనీవా కాలువలో దిగి ఈత కొడుతుండగా నవీన్ (25) అనే యువకుడు బురదలో కూరుకుపోయాడు.

04/08/2018 - 04:54

* సౌమ్య హత్యకేసులో వీడిన మిస్టరీ
* వివాహేతర సంబంధమే కారణం
* నిందితుడిని అరెస్టు చేసిన
* ఎస్‌ఆర్ నగర్ పోలీసులు

04/08/2018 - 04:25

పాతబస్తీ, ఏప్రిల్ 7: రోడ్డు దాటు తూ డివైడర్ తగిలి ముందుకు పడిన వృద్ధుడి పైనుండి ఆటో దూసుకుపోవటంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృ తి చెందాడు. శనివారం సాయంత్రం కొత్తపేట పోలీసు స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. గొ ల్లపాలెంగట్టు వాటర్ ట్యాంక్ సందు లో నివాసమంటున్న షేక్ ఖాశిం(60) శుభకార్యాలకు బాజాభజంత్రీలు వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

04/08/2018 - 03:17

హైదరాబాద్, ఏప్రిల్ 7: అక్రమ రవాణా చేస్తున్న ప్రజా పంపిణీ పథకం (పిడిఎస్)కి చెందిన 75 క్వింటాళ్ల బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి టాస్క్ఫోర్స్ డిసిపి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహ్మద్ అర్షాద్ హుస్సేన్, కుమ్మరి విజయకుమార్, గండ్ల విజయ్‌కుమార్‌ను అరెస్టు చేసి బియ్యంతో పాటు డిసిఎం ఐషర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

04/08/2018 - 02:18

ముంబయి, ఏప్రిల్ 7: కృష్ణ జింకను వేటాడిన కేసులో రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైల్లో గడిపిన నటుడు సల్మాన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు లభించింది. 1998నాటి ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన సల్మాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రవీందర్‌కుమార్ జోషి శనివారం ప్రకటించారు.

04/07/2018 - 04:39

ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 6: మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 13 మంది మందు బాబులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు తీర్పునిచ్చారు.

04/07/2018 - 04:39

జగిత్యాల క్రైమ్: జగిత్యాల ఫస్ట్ క్లాస్ అదనపుజూనియర్ సివిల్ జడ్జి ఎస్. మధు నివాసంలో శుక్రవారం ఉదయం ఏసీబీ దాడులు నిర్వహించడం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. వరంగల్‌కు చెందిన జగిత్యాల కోర్టులో రెండున్నరేళ్లుగా ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జీ పని చేస్తున్న ఎస్. మధు వైఖరిని నిరసిస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు విధులను బహిష్కరించి వారం రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

04/07/2018 - 04:09

కాళ్ల, ఏప్రిల్ 6: పాత గొడవల కారణంగా భార్యను కత్తితో భర్తే అతి దారుణంగా పొడిచి చంపిన సంఘటన శుక్రవారం మండలంలోని జువ్వలపాలెం గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో కాలువ సావిత్రి (55) అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా కలిదిండి మండలం సంతోషపురం గ్రామానికి చెందిన కాలువ ధనరాజు, సావిత్రి తరచు గొడవలు పడుతుంటారు.

04/07/2018 - 03:45

మంగపేట, ఏప్రిల్ 6: అతి వేగంతో వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గారపాటి వీర్రాజు (41), చెట్టుపల్లి లవకుమార్ (25) అనే ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని వాడగూడెం వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి మంగపేట పోలీసులు తెలిపిన ప్రకారం..

04/07/2018 - 03:33

ఎ.కొండూరు, ఏప్రిల్ 6: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కొత్తూరు భాస్కరరావు (55) ఎ.కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి గురువారం రాత్రి తన సహచరుడు దాడి నరేంద్ర మోటారుసైకిల్‌పై వస్తున్నాడు.

Pages