S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/10/2018 - 00:15

అర్వపల్లి, ఏప్రిల్ 9: మూడురోజుల్లో వివాహం జరుగాల్సి ఉండటంతో బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో అనుకొని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. విద్యుత్‌షాక్‌కు గురై పెళ్లికుమారుని తండ్రి, బావ మృతిచెందిన విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

04/09/2018 - 02:30

చెన్నై, ఏప్రిల్ 8: మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌ను అరికట్టడానికి బీసీసీఐ ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండానే ఐపీఎల్‌ను నిర్వహించొద్దంటూ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్ అధికారి జి.సంపత్‌కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖల చేశాడు. ఐపీఎల్‌లో ఆడే 8 జట్లను ఇందులో ప్రతివాదులుగా చేర్చాడు. పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ ఇంద్రా బెనర్జీ, జస్టిస్ సెల్వంతో కూడిన ధర్మాసనం..

04/09/2018 - 01:14

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలుగు సినీ రంగం (టాలీవుడ్)తో పాటు రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఈ కేసులను విచారిస్తున్న ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమవుతోంది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

04/09/2018 - 00:14

వరంగల్, ఏప్రిల్ 8: వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

04/08/2018 - 22:52

చంద్రగిరి, ఏప్రిల్ 8: చంద్రగిరి మండలం మామండూరు వద్ధ కారు-లారీ ఢీకొనడంతో మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన ధనంజయ కుటుంబ సభ్యులు మారుతీ కారులో తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవగా మామాండూరు వద్ద చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ కారును ఢీకొనడంతో ధనంజయ, భార్య కోమల, మరో ముగ్గరికి తీవ్రగాయాలయ్యాయి.

04/08/2018 - 22:48

తిరుపతి, ఏప్రిల్ 8: అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నెట్టికంటి (54) అనే వ్యక్తి ఆదివారం తిరుమలలోని మాధవ నిలయం వద్ద మృతి చెంది పడి ఉండగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని దుస్తులను పరిశీలించగా అతని వద్ద ఆధార్ కార్డు లభించింది. దీని ఆధారంగా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

04/08/2018 - 22:46

హిందూపురం, ఏప్రిల్ 8: స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) మృతి చెందాడు. మృతుడు నీలం రంగు టీషర్టు, లైట్ బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వ్యక్తులు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

04/08/2018 - 22:45

హిందూపురం, ఏప్రిల్ 8 : హిందూపురం రూరల్ మండల పరిధిలోని జంగాలపల్లి వద్ద హంద్రీనీవా కాలువలో ఈత కోసం వచ్చిన ఓ యువకుడు తోటి స్నేహితుల ఎదుటే ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటు చేసుకొంది. ఆదివారం మధ్యాహ్నం సోమందేపల్లి మండలం నడింపల్లికి చెందిన కొందరు నాయకులు ఈత కోసం జంగాలపల్లి వద్దకు వచ్చారు. హంద్రీనీవా కాలువలో దిగి ఈత కొడుతుండగా నవీన్ (25) అనే యువకుడు బురదలో కూరుకుపోయాడు.

04/08/2018 - 04:54

* సౌమ్య హత్యకేసులో వీడిన మిస్టరీ
* వివాహేతర సంబంధమే కారణం
* నిందితుడిని అరెస్టు చేసిన
* ఎస్‌ఆర్ నగర్ పోలీసులు

04/08/2018 - 04:25

పాతబస్తీ, ఏప్రిల్ 7: రోడ్డు దాటు తూ డివైడర్ తగిలి ముందుకు పడిన వృద్ధుడి పైనుండి ఆటో దూసుకుపోవటంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృ తి చెందాడు. శనివారం సాయంత్రం కొత్తపేట పోలీసు స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. గొ ల్లపాలెంగట్టు వాటర్ ట్యాంక్ సందు లో నివాసమంటున్న షేక్ ఖాశిం(60) శుభకార్యాలకు బాజాభజంత్రీలు వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Pages