S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/05/2018 - 02:42

సదాశివనగర్, అక్టోబర్ 4: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదుపై సెక్షన్ 171/ఈ ప్రకారం బుధవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సదాశివనగర్ ఎస్‌ఐ నరేష్ తెలిపారు. సదాశివనగర్ ఇన్‌చార్జి తహశీల్దార్ రంజిత్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు.

10/05/2018 - 02:13

రాజోలు, అక్టోబర్ 3: ఇంటి నుండి బయలుదేరి అత్తవారింటికి మోటారు సైకిల్‌పై భార్యాభర్తలు కలిసి వెళుతుండగా శివకోడులో బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి.

10/05/2018 - 01:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: మైన్మార్‌కు చెందిన ఏడుగురు రోహింగ్యాలను ఆ దేశానికి అప్పగించే విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏడుగురు రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి వచ్చి స్థిరపడినట్లు రుజవైనందున కోర్టు శిక్ష కూడా విధించిందని, మియాన్మార్ కూడా తమ దేశ పౌరులని గుర్తించిందని సుప్రీంకోర్టు పేర్కొం ది.

10/05/2018 - 03:48

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో నిల్వజలాలపై అధ్యయనం చేశారా? అని కేంద్ర జల సంఘాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనిపై అధ్యయనం చేసి ఉంటే శుక్రవారం కోర్టుకు అందజేయాలని, లేని పక్షంలో ఈ అధ్యయనానికి ఎంత సమయం పడుతుందో తెలిపాలని ధర్మాసనం కేంద్ర జల సంఘాన్ని కోరింది.

10/05/2018 - 00:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్, శాసన సభకు ముందుస్తు ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టులో దాఖలైన ఈ రెండు రిట్ పిటిషన్‌లను కొట్టివేస్తూ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ధర్మాసనం సూచించింది.

10/04/2018 - 23:13

సత్యవేడు, అక్టోబర్ 4: ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డుకు అడ్డుగా పంది రావడంతో తప్పించబోయి అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని వీఆర్ కండ్రిగ గ్రామశివారులో బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

10/04/2018 - 22:20

మేదరమెట్ల, అక్టోబర్ 4 : ఇంటి తాళం తీసుకొని పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలోని బంగారు నగలను దొంగలించిన సంఘటన కొరిశపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తమ్మవరం గ్రామానికి చెందిన యద్దనపూడి పోతురాజు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళుతూ ఇంటికి తాళం వేసి తాళం చెవిని గూటిలో పెట్టి వెళ్లాడు.

10/04/2018 - 05:30

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు.

10/04/2018 - 04:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: లాభాపేక్ష వ్యవహారానికి సంబంధించిన అంశంలో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలపై తన స్పందన తెలియచేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను అనర్హతకు గురైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేశారు. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ మృదుల్ విచారించారు.

10/04/2018 - 02:28

కంకిపాడు, అక్టోబర్ 3: పదిరోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు కాలువలో శవమై తేలాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం కంకిపాడు చెందిన వంగా వంశీ(23) గత నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. అతని తల్లి రాజేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు ఈ నెల 2న అదృశ్యం కేసు నమోదైంది.

Pages