S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/04/2018 - 02:14

ఎల్లారెడ్డి, అక్టోబర్ 3: డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో గల ఓ రైస్ మిల్లులో అక్రమంగా కిరోసిన్ దందా చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు, బుధవారం సివిల్ సఫ్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు స్టేట్ టాస్క్ఫొర్స్ సివిల్ సఫ్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, జిల్లా జేసీ యాదిరెడ్డి ఆదేశాల మేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

10/04/2018 - 02:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: కొరిగాన్ బీమా కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు మానవ హక్కుల సంఘం నేతల్లో ఒకరిని విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మహారాష్ట్రప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మానవ హక్కుల సంఘం నేత గౌతమ్ నవలకను గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని కోర్టు ఆదేశించిన విషయం విదితమే.

10/04/2018 - 01:51

జీడిమెట్ల, అక్టోబర్ 3: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేశ్ కథనం ప్రకారం.. నర్సాపూర్‌టౌన్, చైతన్యపురి కాలనీకి చెందిన వడ్ల గణేశ్ (21) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అదే కాలనీకి చెందిన ఎం.సాయి కుమార్ (21) బార్బర్ పని చేస్తాడు. అదే కాలనీకి చెందిన ఈశ్వరమ్మ (40) కూరగాయల వ్యాపారం చేస్తుంది.

10/04/2018 - 01:01

న్యూఢిల్లీ, అక్టోబరు 3: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నది జలాల పంపకాలపై ఉద్దేశించబడిన జస్టిస్ బ్రీజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ గురువారానికి వాయిదా పడింది. ట్రిబ్యునల్ ముందు హైడ్రాలజీ అంశాలపై ఏపీ తరపు సాక్షిగా ఉన్న హైడ్రాలజీ నిపుణుడు విశే్వశ్వరరావును తెలంగాణ తరపున సీనియన్ న్యాయవాది వైద్యనాథన్ బుదవారం క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

10/04/2018 - 05:13

న్యూఢిల్లీ: సవరించిన హైకోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాల్లోని న్యాయాధికారుల ఎంపిక జరిపి, రెండు నెలల లోగా కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సక్రి, జస్టిస్ అశోక్ భూషన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసుపై సుప్రీం కోర్టులో దాదాపు మూడు సంవత్సరాల పాటు విచారణ జరగడం గమనార్హం.

10/04/2018 - 00:01

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై దాఖలైన పిటిషన్లు విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది. ఈ పిటిషన్లు బుధవారం జస్టిస్ అభయ్ మనోహర్ సప్రె, జస్టిస్ ఇందు మాల్హోత్రతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఉద్యోగుల విభజన సంబంధించిన ప్రతిపాదనల ప్రతిని ధర్మాసనానికి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది గిరి అందించారు.

10/03/2018 - 23:52

హిందూపురం రూరల్, అక్టోబర్ 3: రూరల్ మండల పరిధిలోని కొటిపి రహదారిలోని రైల్వే గేట్ వద్ద మంగళవారం రాత్రి రామాంజినేయులుపై పలుమార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. లేపాక్షికి చెందిన నగేష్, మడకశిర మండలం కోడిపల్లికి చెందిన కిష్టప్ప ఈ దారుణానికి పాల్పడ్డారు. గ్రామస్థులు తెలిపిన మేరకు రైల్వేగేట్ వద్ద అరుపులు వినబడటంతో గేట్‌మెన్ విషయాన్ని ఫోన్ ద్వారా గ్రామస్థులకు తెలిపారు.

10/03/2018 - 23:31

గంట్యాడ, అక్టోబర్ 3: విధి నిర్వహణ నిమిత్తం రిగ్‌పై కూర్చుని వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన యువకుని ఉదంతం ఇది. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కురుపాం మండల కేంద్రానికి చెందిన బి.కిరణ్(19) నవీన్‌రెడ్డి బోర్‌వెల్స్‌లో వర్కర్‌గా చేరాడు.

10/03/2018 - 22:21

రాజాం, అక్టోబర్ 3: రాజాం నగర పంచాయతీ సారధి గ్రామానికి చెందిన గెడ్డాపు నీలవేణి (32) అనే మహిళ విషజ్వర లక్షణాలతో బుధవారం ఉదయం శ్రీకాకుళంలో కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజాం బస్టాండ్ ప్రాంతంలో భర్త రామకృష్ణతో పళ్ల బండి నడుపుతూ జీవనం సాగించేంది. మృతి చెందిన నీలవేణికి రెండేళ్ల పాప కూడా ఉంది. పేద ఎస్సీ కుటుంబానికి చెందిన వీరికి చంద్రన్న బీమాతో ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

10/03/2018 - 06:58

జగిత్యాల, అక్టోబర్ 2 : వాస్తు దోషం వల్లే మీ కొడుకు పెళ్లి కావట్లేదు ..పూజలు చేస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయని నమ్మించి పదకొండున్నర తులాల బంగారంతో ఉడాయంచాడు ఓ దొంగబాబా. ఘటన జిల్లా కేంద్రమైన జగిత్యాలలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని బుక్కవాడలో భూస రాధ - గంగాధ ర్ దంపతులు నివసిస్తున్నారు. వారి ఇంటికి గుర్తు తెలియని ఓ బాబా సోమవారం ఉద యం 10 గంటల సమయంలో వచ్చాడు.

Pages