S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/01/2018 - 23:48

తిరుపతి, ఏప్రిల్ 1: తమ పిల్లలను డాక్టర్లను చేయాలని, అందుకు అవసరమైన ప్రవేశ పరీక్షలను రాయించడానికి తిరుపతికి వచ్చి తిరిగివెడుతూ చంద్రగిరి పనబాకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థుల తండ్రులిద్దరు కానరానిలోకానికి వెళ్లారు. దీంతో వారి కుటుంబంలోనూ, వారి స్వస్థలం వి.కోటలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.

04/01/2018 - 23:46

రేణిగుంట, ఏప్రిల్ 1: రేణిగుంట మండలం ఆంజనేయపురం అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద టవేరా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలను చెక్‌పోస్టు సిబ్బంది ఆదివారం పట్టుకున్నారు.

04/01/2018 - 22:44

డోన్, ఏప్రిల్ 1:డోన్ పట్టణంలోని ఇందిరానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు గోపాల్ శర్మ ఇంట్లో దొంగలు పడి బీభత్సం సృష్టించారు. గోపాల్‌శర్మ ఇంట్లో దాచి ఉంచిన 60 తులాల బంగారు ఆభరణాలు, రూ. 8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. గోపాల్‌శర్మ కూతురు హైదరాబాద్‌లో ఉంటుంది.

04/01/2018 - 22:40

సి.బెళగల్, ఏప్రిల్ 1:మండల పరిధిలోని సింగవరం గ్రామం సమీపంలో ఆదివారం తుంగభద్ర నదిలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామానికి చెందిన నరసింహులు(45)గా గుర్తించి అతడి భార్య ఈశ్వరమ్మకు సమాచారం ఇవ్వగా ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించింది.

04/01/2018 - 22:37

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 1: మండలంలోని వేగవరం సమీపంలోని పెట్రోలు బంకు వద్ద రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యింది. మోటార్ సైకిల్‌ను పామాయిల్ ఫ్యాక్టరీకి చెందిన లారీ వెనుక నుండి ఢీకొనడంతో మోటార్ సైకిల్ వెనుక కూర్చొన్న చీదర రాధ (29) లారీ చక్రాల కింద పడిపోయింది. చక్రాలు ఆమె తలపై నుండి, శరీరంపై నుండి ఎక్కి వేయడంతో దుర్మరణం పాలయ్యింది.

04/01/2018 - 04:49

నందివాడ, మార్చి 31: చేపల చెరువుమీద చెట్లు నరకడానికి వెళుతూ ఇద్దరు వ్యక్తులకు విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. నందివాడ ఎస్‌ఐ మణికుమార్ కథనం ప్రకారం అరిపిరాల గ్రామంలో 23 ఎకరాల భూమిని రఘురామరాజు అనే వ్యక్తి లీజుకు తీసుకొని చేపల చెరువు తవ్వుతున్నారు.

04/01/2018 - 04:48

నూజివీడు, మార్చి 31: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నూజివీడుకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పామర్తి సురేష్‌బాబు శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నూజివీడులో ఆర్‌ఎంపీ వైద్యునిగా కొంతకాలం పనిచేసిన సురేష్‌బాబు కొంత కాలం క్రితం చల్లపల్లి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో స్థానిక గాంధీనగర్ ప్రాంతంలోని ఉషాబాల నగర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

04/01/2018 - 03:43

వికారాబాద్, మార్చి 31: అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసిన కేసులో వికారాబాద్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. వికారాబాద్ సీఐ ఎం.వెంకట రామయ్య తెలిపిన వివరాల ప్రకారం 2014 ఆగస్టు 21న వికారాబాద్ పట్టణం గంగారానికి చెందిన పర్వీన్‌బేగంను భర్త ఎండీ హాజీ, అత్త హుస్సేన్‌బీ అదనపు కట్నం కోసం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.

04/01/2018 - 02:47

గుంటూరు (లీగల్), మార్చి 31: గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో ఆధిక్యతను చాటుకున్న జనచైతన్య సంస్థల అధినేత మాదల సుధాకర్‌కు తన మొదటి భార్యను వేధించిన కేసులో రెండేళ్ల జైలుశిక్ష, పదివేల జరిమానా విధిస్తూ గుంటూరు 5వ అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ శనివారం తీర్పు చెప్పారు. సీఐడి పోలీసులు నమోదు చేసిన ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

04/01/2018 - 02:34

కాకినాడ, మార్చి 31: సెంట్రల్ యూనివర్సిటీ (హైదరాబాద్) వైస్ ఛాన్సలర్ ఆచార్య పి అప్పారావును హతమార్చడానికి జరిగిన కుట్రను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కుట్ర పన్నిన మావోయిస్టు సానుభూతిపరులైన అదే యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పూర్వ విద్యార్థులను అరెస్టుచేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ శనివారం కాకినాడలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Pages