S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/18/2018 - 00:00

గుంటూరు, ఆగస్టు 17: జల్సాలు, దుర్వ్యసనాలకు బానిసలైన గుంటూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు కార్లు, మోటారు సైకిళ్లు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ గజదొంగలుగా మారారు. ఎట్టకేలకు నగరంపాలెం సిఐ శ్రీ్ధర్‌రెడ్డి, సీసీఎస్ సీఐలు రత్నస్వామి, ఆర్ సురేష్‌బాబుల నేతృత్వంలో నిందితులను అరెస్ట్‌చేశారు.

08/17/2018 - 23:49

నాయుడుపేట, ఆగస్టు 17: మండల పరిధిలోని గ్రీన్‌టెక్ కంపెనీలో ఇంటి దొంగలు నిజమేనని గతంలో మేనేజర్‌గా పనిచేసి మానేసిన వ్యక్తి, ప్రస్తుతం పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో కుమ్మక్కై భారీ చోరీకి పథకం వేశారని గూడూరు డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక సిఐ కార్యాలయంలో గ్రీన్‌టెక్ కర్మాగారంలో జరిగిన చోరీలపై విలేఖరులతో మాట్లాడారు.

08/17/2018 - 00:54

హైదరాబాద్, ఆగస్టు 16: జంటనగరాల్లో బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తూ జీఎస్‌టీకి చెల్లించాల్సిన పన్నులను ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలపై గురువారం తూనికలు కొలతల అధికారులు కొరడా ఝుళిపించారు. అధికారుల దాడుల సమయంలో వ్యాపారస్థులు దుకాణాలు బంద్ చేశారు. వ్యాపారుల మోసాలను గుర్తించిన అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టడంతో జీఎస్‌టీ మోసాలు బట్టబయలు అయ్యాయి.

08/17/2018 - 00:21

పాయకాపురం, ఆగస్టు 16: బాలిక అదృశ్యమైన సంఘటన నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పట్టా నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాధానగర్ నివాసి చెన్నుపాటి సునీత కుమార్తె చెన్నుపాటి మేరీ (16) ఈనెల 14నుంచి కనిపించడం లేదు. ఆచూకి కోసం బంధులను విచారించినా ఆచూకీ లభించకపోవడం నున్న పోలీసులను ఆశ్రయించారు.

08/16/2018 - 23:53

కొల్చారం, ఆగస్టు 16: ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై పెంటయ్య, ప్రయాణికుల కథనం ప్రకారం పోతన్‌శెట్టిపల్లి హనుమ్‌బండాల్ సమీపంలో సికింద్రబాద్ నుండి మెదక్ వస్తున్న ఆర్టీసీ బస్సు కిష్టాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి యాదగిరి(28), మహ్మద్ ఆసీఫ్(26)లు బైక్‌పై కొల్చారం వైపు వస్తున్నారు.

08/16/2018 - 23:52

నంగునూరు, ఆగస్టు 16: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం గట్లమల్యాలలో గురువారం జరిగింది. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ చంద్రశేఖర్, గ్రామస్థు కథనం ప్రకారం గట్లమల్యాల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పుల్లూరి సాయితేజ, అనిల్, అరుణ్ లు చదువుకుంటున్నారు.

08/16/2018 - 23:40

నిజామాబాద్, ఆగస్టు 16: లైంగిక వేధింపుల ఆరోపణలపై జ్యుడీషియల్ రిమాండ్ కింద జిల్లా జైలులో కాలం వెళ్లదీస్తున్న నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసును విచారణ జరుపుతున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం జడ్జి రమేష్, ఈ నెల 20వ తేదీన బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు.

08/16/2018 - 23:39

మాక్లూర్, ఆగస్టు 16: ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తాకొట్టిన సంఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్ప శివారులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మాక్లూర్ ఎస్‌ఐ సాయినాథ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

08/16/2018 - 23:18

బనగానపల్లె, ఆగస్టు 16:పట్టణంలో గురువారం టీడీపీ కార్యకర్త, రాష్ట్ర కార్మిక కనీస వేతన సవరణ బోర్డు డైరెక్టర్ పాలూరు లక్ష్మీనరసింహకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్ జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంటి పక్కనే వున్న గదిలో ఉరి వేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బనగానపల్లె ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

08/16/2018 - 23:17

బనగానపల్లె, ఆగస్టు 16:మండల పరిధిలోని చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన మహమ్మద్‌గౌస్(70) గురువారం ఉదయం ప్రమాదవశాత్తూ ఎస్‌ఆర్‌బీసీ కాలువలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నరాజుపాలెం గ్రామం నుంచి వచ్చిన మహ్మద్‌గౌస్ బనగానపల్లె సమీపంలో ఎస్‌ఆర్‌బీసీ కాలువ కట్టపై బహిర్భూమికి వెళ్లి నీటిలోకి పడిపోయాడు.

Pages