S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/07/2018 - 01:16

పెద్దపంజాణి: ఓ అమ్మకడుపున పుట్టిన అన్నదమ్ముల పేగుబంధం వీడక కలిసి మృత్యువాత పడ్డారు.ట్రాక్టర్ కూలీకోసం వెళ్ళి, ఇసుకదిబ్బలు విరిగిపడి మీద పడడంతో మృతి చెందారు. మృత్యువులోనూ వీరి రక్తబంధం వీడలేదు. ఈ విషాద సంఘటన పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ముదరంపల్లె పంచాయతీకి చెందిన బాలిరెడ్డి, రామక్కలకు ఆరుగురు సంతానం.

09/06/2018 - 04:35

తిరుపతి, సెప్టెంబర్ 5: ఆర్థికభారం ఒక కార్మికుడి కుటుంబంలో తీరని విషాదం నింపింది. తల్లీకొడుకు బలవన్మరణానికి ప్రేరేపించింది. స్థానిక పర్సాల వీధిలో నివాసం ఉంటున్న గంగాధర్ (26) తిరుమల టీటీడీ లగేజీ సెంటర్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

09/06/2018 - 04:16

సిమ్లా: నాలుగేళ్ల బాలుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేసి కొట్టి హింసించి, అతనికి బలవంతంగా మద్యం తాగించి, రాయి కట్టి ట్యాంకులోకి తోసి కిరాతకంగా చంపిన కేసులో ముగ్గురికి మరణ శిక్ష విధిస్తూ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది.

09/06/2018 - 02:32

కదిరి, సెప్టెంబర్ 5: పట్టణంలోని కాలేజి రోడ్డులో ప్రధాన రహదారిపై వున్న మహమ్మద్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున దొంగలుపడి 46 తులాల బంగారు, 50 తులాల వెండి, రూ. 3.10 లక్షలు నగదును దోచుకెళ్లారు. బాధితుడు మహమ్మద్ తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తుండగా ఇంటి వెనుకవైపున మెష్‌ను తొలగించి ఇంట్లోకి చొరబడి బీరువాలో వున్న బంగారు, నగదును దోచుకెళ్లారన్నారు.

09/06/2018 - 02:15

ములకలచెరువు, సెప్టెంబర్ 5: స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. మండలంలోని కదిరినాధునికోట పంచాయతీ, నాయునివారిపల్లెకు చెందిన తిరుమల ఆనంద్, శశికళ దంపతుల కుమారుడు తిరుమల అజయ్ మండల కేంద్రమైన ములకలచెరువులో ఓ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు.

09/06/2018 - 02:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మాగాణి భూములను (వెట్ ల్యాండ్స్) పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ భూములు ఆక్రమణకు గురికాకుండా, వ్యర్థ పదార్థాలకు డంపింగ్ యార్డుగా తయారుకాకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వివరాలను పర్యావరణ మంత్రిత్వ శాఖ బుధవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలియచేసింది.

09/06/2018 - 01:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ విషయంలో పేరు లేని వారు తమ అర్హతపై పది డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను చూపించే విషయమై కేంద్రం తన వైఖరిని తెలియచేయాలని సుప్రీంకోర్టు కోరింది. కేంద్రం వైఖరి తెలియచేసే వరకు ఈ రిజిస్టర్‌పై అభ్యంతరాలను తెలియచేసేందుకు ప్రారంభించే ప్రక్రియను కోర్టు వాయిదా వేసింది.

09/06/2018 - 01:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగిన మూకదాడి కేసులో విచారణ జరపాలని మీరట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో, ఏఎం ఖన్వీల్కర్, డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నది.

09/06/2018 - 01:30

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 5: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్తకు జీవిత ఖైదు, మూడు వేల రూపాయలు జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా ముదినేపల్లి పెయ్యేరు గ్రామానికి చెందిన బొల్లు రాజేష్ (40) ఇదే గ్రామానికి చెందిన తిరుపతమ్మను 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

09/06/2018 - 01:29

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 5: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో పది సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.

Pages