S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/29/2018 - 03:54

మధిర: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కుటుంబ సభ్యులు ముగ్గురు రైలు కింద పడి మృతి చెందారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాల ప్రకారం వీరిని గుంటూరు వాసులుగా భావిస్తున్నారు. వీరు ఆత్మహత్యకు పాల్పడి వుంటారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు.

05/29/2018 - 02:55

హైదరాబాద్, మే 28: వ్యభిచార గృహాల నిర్వహణ, యువతులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి పడుపు వృత్తి చేయించడమే వృత్తిగా చేసుకున్న ఇంజమూరి విజయ్‌కుమార్ అలియాస్ విజయ్‌పై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పిడి చట్టం ప్రయోగించారు. 2013 నుంచి ఇదే వృత్తిని చేసుకున్న విజయ్‌కుమార్ చాలా సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు.

05/29/2018 - 02:49

హైదరాబాద్, మే 28: బంగారం దుకాణంలో పని చేస్తున్న 19 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంకు చెందిన ఒక కుటుంబం 9 ఏళ్ల నుంచి యూసఫ్‌గూడలో నివాసం ఉంటుంది. తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ ఇస్ర్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

05/29/2018 - 02:43

కరీంనగర్ టౌన్, మే 28: అంతర్ జిల్లాస్థాయిలో మోటార్ సైకిళ్ళు దొంగతనం చేస్తూ, పలుచోట్ల విక్రయిస్తున్న దొంగల ముఠాను సోమవారం పట్టుకున్నట్లు పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు.

05/29/2018 - 02:35

రాయ్‌పూర్, మే 28: చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బిజాపూర్ జిల్లాలో వేర్వేరుచోట్ల 12మంది నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టు బిజాపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ వెల్లడించారు. బాసగూడ ఠాణా పరిధిలోని డాల్ల అటవీ ప్రాంతంలో ఆరుగురిని, బేద్రే ఠాణా పరిధిలో ఐదుగురుని, తర్నిచ్చిల్పత్పార అటవీ ప్రాంతంలో మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు గార్గ్ వెల్లడించారు.

05/29/2018 - 02:09

కైకలూరు, మే 28: గ్రామ పెద్దల్లో జరిగిన ఘర్షణలో కొడుకు తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన తండ్రి వారం రోజుల తరువాత సోమవారం మృతి చెందాడు. దీనిపై కైకలూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం వడ్లకూటితిప్పకు చెందిన బలే వెంకన్న (50)కు, అతని కుమారుడు నాగరాజుల మధ్య ఈ నెల 21వ తేదీన పెద్దల సమక్షంలో స్వల్ప వివాదం తలెత్తింది.

05/29/2018 - 01:27

ఎర్రుపాలెం, మే 28: ఐపియల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్ పెట్టి ఆడుతున్న యువకులను ఎర్రుపాలెం ఎస్సై జె అంజనేయులు ఆదివారం రాత్రి దాడి చేసి పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆదివారం రాత్రి జరిగిన చెనై- హైద్రాబాదు క్రికేట్ మ్యాచ్‌కి సంబందించి జమలాపురం గ్రామానికి చెందిన 22మంది ఎన్టీఆర్ విగ్రహం వద్ద క్రికెటు బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకుని వారి వద్ద నుండి 7వేలు రూపాయలు, స్వాధీనం చేసుకున్నారు.

05/29/2018 - 00:40

మద్దిపాడు, మే 28 : జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున మద్దిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం చెన్నై నుండి మహబూబ్ నగర్‌కు వెళుతున్న ఎల్‌పిజి గ్యాస్ ట్యాంకర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మద్దిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగింది. ట్యాంకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు.

05/28/2018 - 23:49

గద్వాల, మే 28: గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డులోని టి.వెంకట్‌రెడ్డి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.10 లక్షల విలువైన పత్తి నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా ప్యాకింగ్ చేస్తుండగా టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు.

05/28/2018 - 23:41

జహీరాబాద్, మే 29: పురివిప్పిన పాతకక్షలు ఓ వ్యక్తిని బలితీసుకున్నాయి. మండలంలోని శేకాపూర్‌లో టెంట్‌హౌజ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముస్లీం డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఎండీఏ)అధ్యక్షుడు ఎంఏ గౌస్(38) ను దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించి సీఐ.సైదీశ్వర్ కథనం ప్రకారం..

Pages