S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/28/2018 - 22:03

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 28: రాజమహేంద్రవరం ఆర్టీఒ కార్యాలయంలో పరిపాలనాధి కారిగా పనిచేస్తున్న కిరణ్‌పాల్ డెంగీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ఇటీవల ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు కాకినాడ నగరంలో ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెల్లారు. అక్కడి వైద్యులు ఏఓ కిరణ్‌పాల్‌ను పరీక్షించి డెంగీ వ్యాధికి గురైనట్లు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు.

09/28/2018 - 21:59

రామచంద్రపురం, సెప్టెంబర్ 28: రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని కె గంగవరం మండల ప్రధాన కేంద్రమైన గంగవరం గ్రామంలో మణికంఠ ఫైర్‌వర్క్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ విస్ఫోటనం జరగడంతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడ ఏం జరిగిందోనన్న భయాందోళనతో రహదారిపైకి పరుగులు తీశారు.

09/28/2018 - 21:44

కదిరి, సెప్టెంబర్ 28 : నకిలీ పాసుపుస్తకాల కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ మన్నూరుద్దీన్ తెలిపారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకల్లు మండల కేంద్రంలో ఈనెల 26న పోలీసులు దాడి చేయడంతో దొరికిన నకిలీ పాసు పుస్తకాల కేసుకు సంబంధించి శివశంకర్ జిరాక్స్ సెంటర్ యజమాని శివశంకర్‌తోపాటు గంగులప్పను అరెస్టు చేసినట్లు తెలిపారు.

09/28/2018 - 21:31

నేరడిగొండ, సెప్టెంబర్ 28:మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన పీజీ హెచ్‌ఎం లక్ష్మణ్‌రావు (44) శుక్రవారం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

09/28/2018 - 02:59

నేరడిగొండ,సెప్టెంబర్ 27: నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన గిరిజన రైతు రాథోడ్ పాండు(60) పోలీసుల వేదింపులు తాళలేక మనస్థాపంతో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదం నింపింది.

09/28/2018 - 02:55

స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 27: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న దామెర శివాజీ(18) అనే విద్యార్ధి గూడ్స్‌రైలు కిందపడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన రాజకొంరయ్య, భాగ్యలక్ష్మిల కుమారుడు దామెర శివాజి మండలంలోని శివునిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ట్రిపుల్ ఇ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు వారు తెలిపారు.

09/28/2018 - 02:48

మల్యాల, సెప్టెంబర్ 27: మల్యాల మండలం నూకపల్లి శివారు గాడుదల గుట్ట ప్రాంతంలో గురువారం రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరిద్దరూ గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వెల్మల ఉమారాణి (40), గాదె కిరణ్‌కుమార్ (31)గా పోలీసులు గుర్తించారు. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఏర్పా టు చేసిన కరెంట్ తీగెలపై మృతులు పడి ఉండడంతో బలైనట్లుగా స్థానికులు భావిస్తున్నారు.

09/28/2018 - 00:39

నార్సింగి, సెప్టెంబర్ 27: గుట్టుచప్పుడు కాకుండా గంజాయ అమ్ముతున్న వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేస్తే, వారి బంధువులు ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఘటన మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

09/28/2018 - 00:36

ఉప్పల్, సెప్టెంబర్ 27: త్రిబుల్ రైడింగ్ రోడ్డు ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఎంబీఏ విద్యార్థిని దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ లక్ష్మీనగర్‌లో నివసిస్తున్న పీ.వెంకట సంధ్యారాణి (22) ఘట్‌కేసర్‌లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది.

09/28/2018 - 00:36

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 27: నిద్రమత్తులో బాహ్యవలయ డివైడర్‌ను ఢీ కొట్టిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు ఒకరు గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన కుందురు భరత్ రెడ్డి(27), అనూష రెడ్డి భార్యాభర్తలు.

Pages