S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/24/2018 - 23:18

నందలూరు, మే 24: నందలూరు హైవేలో గురువారం నిర్వహించిన వాహనాల తనిఖీలో మద్యం సేవించి లారీని నడిపిన బేతంచర్లకు చెందిన డ్రైవర్ ఎం.వెంకటేష్‌ను కోర్టులో హాజరు పరచగా జడ్జి సౌమ్యజోసిఫిన్ 70 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శిక్ష విధించిన డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

05/24/2018 - 22:31

అగళి, మే 24 : మండల పరిధిలోని బొమ్మరసనపల్లికి చెందిన దేవరాజు(42) బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎఎస్సై ఖలీల్‌బాషా తెలిపారు. దేవరాజు గత కొంతకాలంగా మద్యం సేవించేవాడని, మద్యం సేవించడానికి అప్పులు అధికం కావడంతో మనస్తాపానికి గురై మద్యంలో పురుగుల కలుపుకొని సేవించాడు.

05/23/2018 - 01:53

లక్సెట్టిపేట, మే 22: మండలంలోని దౌడపల్లిలో తనయుడు తండ్రిపై కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మంచిర్యాలకు చెందిన కునారపు మల్లయ్య తన కూతురు వద్ద ఉంటున్నాడు. మల్లయ్యకు ఇద్దరు భార్యలు ఉన్న ట్లు తెలిసింది. కాగా కొంత కాలం క్రితం మల్లయ్య తన రెండో భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి తన కూతురి వద్ద ఉంటున్నాడు.

05/23/2018 - 01:52

లక్సెట్టిపేట, మే 22: మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన అంకూస్‌బీ (45) అనే మహిళ ఇంట్లోని రేకుల షెడ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తన పెద్ద కూతురు మానసిక పరిస్థితి బాగా లేదని, ఆమె విషయంలోనే అంకూస్‌బీ ఎప్పుడూ దిగాలుగా ఉండేందని కుటుంబసభ్యులు చెప్పారు.

05/23/2018 - 01:23

సిరిసిల్ల, మే 22: జిల్లాలో సంచలనం రేపిన మూడపల్లి గ్రామ సర్పంచ్ గోలి శంకర్ హత్య కేసును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హగ్డే నిందుతులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.

05/23/2018 - 01:21

సైదాపూర్, మే 22: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో జనబోయిన నర్సయ్య (75) అనే వృద్ధుడిని చున్నీతో మెడకు ఉరివేసి నులిపి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన మంగళవారం గ్రామంలో చోటు చేసుకుంది. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు నర్సయ్యకు రెండు ఎకరాల భూమి ఉండగా, ఆ భూమిని తన కొడుకు వెంకటస్వామికి ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ చేయించారు.

05/23/2018 - 01:19

కాల్వశ్రీరాంపూర్, మే 22: మండలంలోని కూనారం గ్రామంలో మిషన్ కాకతీయ పనులలో భాగంగా మంగళవారం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో ఒకరు మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..కూనారం గ్రామానికి చెందిన పానుగంటి సదానందం (35) అనే ట్రాక్టర్ డ్రైవర్ చెరువు కట్టపై నుండి మొరం తీసుకొని వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కట్టకిందికి బోల్తాపడింది. దీంతో డ్రైవర్ సదానందం అక్కడికక్కడే మృతి చెందాడు.

05/23/2018 - 01:10

కంకిపాడు, మే 22: ఇంటి ముందు ఆరుబయట విశ్రాంతి తీసుకుంటున్న మహిళ మెడలో గొలుసు తెంచుకొని పరారైన ఘటన మండలంలోని గొడవర్రులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శివాలయం సమీపంలో నివసించే పైకం సునీత సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఇంటి ఆవరణలో మంచం వేసుకొని నడుంవాల్చి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన దొంగ ఆమె మెడలోని 5కాసుల బంగారు నాంతాడును తెంచుకుని పరారయ్యాడు.

05/23/2018 - 00:49

వీరవాసరం, మే 22: ఇటీవల ప్రసార మాధ్యమాల్లో సైకోలు తిరుగుతున్నారంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో మంగళవారం వీరవాసరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పెరిగిన జుత్తు, గెడ్డం, మాసిబోయిన దుస్తులతో ఆ వ్యక్తి చూసేందుకు భయంకరంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు అప్పగించారు.

05/23/2018 - 00:26

మారేడుమిల్లి, మే 22: మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలస పంచాయితీ పరిధిలోని వాలమూరు గ్రామంలో గల పాములేరు వాగులో పడి మంగళవారం ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన నందికళ్ళ మణీంద్ర (21), గ్రంధి బుచ్చిరాజుగుప్త (21) పాములేరువాగులో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు.

Pages