S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/17/2018 - 22:02

తనకల్లు, జూన్ 17: పెద్దలు సంపాదించిన ఆస్తిని పంచుకోవడానికి అన్నదమ్ముల మధ్య చెలరేగిన చిన్నపాటి గొడవలు హత్య దాకా దారితీసాయి. ఆస్తి కోసం అమ్మ కడుపున పుట్టిన తమ్ముని సైతం నరికి చంపిన దారుణం తనకల్లు మండలంలోని బొందలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.

06/17/2018 - 04:06

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్, జూన్ 16:రోజు రోజుకు మానవత్వం మంట గలిసిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకానీ పరిస్థితులు నెలకొన్నాయి. మానసిక వికలాంగులుగా జన్మిండమే తప్పా. ప్రపంచాన్ని పరిచయం చేసుకోకుండానే పైకి వెళ్లిపోయారు. తమకు రక్షణగా నిలబడాల్సిన వాళ్లే కాలయములయ్యారు. ఇద్దరు చిన్నారులను మేనమామే గొంతు నలిమి హత్య చేశాడు. చిన్నారుల హత్యతో చైతన్యపురి ప్రాంతమంత విషాద చాయలు అలుముకున్నాయి.

06/17/2018 - 03:44

బెంగళూరు, జూన్ 16: జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసులో విజయపురా జిల్లా శ్రీరామసేన అధ్యక్షుడు రాకేష్ మత్‌ను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో హిందూత్వ సంస్థకు చెందిన పరుశురా వాగ్మేర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

06/17/2018 - 03:39

తిరువనంతపురం, జూన్ 16: ఒక పోలీసు డ్రైవర్‌పై అదనపు డీజీపీ సుడేష్ కుమార్ కుమార్తె దాడి చేసిన కేసులో ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మ్‌డ్ పోలీస్ బెటాలియన్ అదనపు డిజిగా ఉన్న కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. సుడేష్ కుమార్ కుమార్తె స్నిగ్ధ, పోలీసు డ్రైవర్ గవాస్కర్‌పై దాడి చేసి గాయపరిచింది. ఈ విషయమై గవాస్కర్ కుటుంబ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు.

06/17/2018 - 03:18

తిరుపతి, జూన్ 16: చిట్టీల పేరుతో తెలిసిన వారి నుంచి దాదాపు రూ. 1.60కోట్లు వసూలు చేసుకుని పరారైన మహిళను, ఆమె కుటుంబ సభ్యులను స్థానికులు పట్టుకుని ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. తిరుపతి కొర్లగుంట సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన జ్యోతి డ్వాక్రా సంఘంలో పనిచేస్తోంది. స్థానికంగా అందరితో బాగా పరిచయాలున్న ఆమె తొలుత చిన్న చిన్న చీట్టీలు వేసేది. కాగా కొంత కాలంగా పెద్దమొత్తంలో చిట్టీలు వేస్తోంది.

06/16/2018 - 04:22

కోటవురట్ల, జూన్ 15: మండలంలో బీకేపల్లిలో మైనర్ బాలికపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. విశాఖలో మైక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు ఈకేసును తప్పుదోవ పట్టించడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈకేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరు మైనర్లే కావడం విశేషం.

06/16/2018 - 03:49

హైదరాబాద్, జూన్ 15: నగరంలో 33 దొంగతనాలు చేసిన ముగ్గురు దొంగలు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రూ.70 లక్షల విలువైన 1.65 కిలోల బంగారం, 80 తులాల వెండి, హోండా అక్కార్డ్ కారు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు నగర సిపి అంజనీకుమార్ తెలిపారు.

06/16/2018 - 03:46

హైదరాబాద్, జూన్ 15: ప్రస్తుతం పోలీస్‌లకు సవాల్ విసురుతూ, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ కొత్త పంథాలో మోసాలు చేస్తున్నారు. ఖాతాదారుడికి తెలియకుండానే అకౌంట్లో డబ్బు కాజేస్తున్నారు. క్రెడిట్ కార్డులతో మోసాలు, బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, పిన్ నెంబర్ తీసుకుని దర్జాగా నగదు కొట్టేస్తున్నారు.

06/16/2018 - 02:33

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 15: గత కొంత కాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న దొంగలను ఆర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని శుక్రవారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మహ్మద్ బాషా మీడియా ముందు హాజరు పరిచారు. నిందితుడిని అపహరణకు గురైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మహ్మద్ బాషా మీడియాకు వివరించారు.

06/16/2018 - 02:27

కుషాయగూడ, జూన్ 15: ప్రేమ వివాహం చేసుకున్న యువతిని అపహరించిన ఘటన కుషాయిగూడ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. ఎస్‌ఐ జి.చంద్రశేఖర్, బాధితులు పోలీసుల కథనం ప్రకారం- కుషాయిగూడ- చక్రీపురంలోని నివసిస్తున్న అరుగుల ఆనంద్ బోర్‌వెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన పప్పుల రుచితను ప్రేమించి ఇటీవల ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంపై రుచిత తల్లిదండ్రులు భగ్గుమన్నారు.

Pages