S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/12/2018 - 23:29

అల్లవరం, సెప్టెంబర్ 12: అల్లవరం మండలం ఓడలరేవులో ప్రధాన పైపులైకు రంద్రం చేసి లక్షలు విలువైను క్రూడాయిల్ చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజులుగా సాగుతున్న ఈ దందాలో వేలాది లీటర్లు కుడ్రాయిల్‌ను ట్యాంకర్లు ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు.

09/12/2018 - 22:34

పలాస, సెప్టెంబర్ 12: పలాస సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కార్యాలయం రద్దీగా ఉన్న సమయంలో ఏసీబీ డి ఎస్పీ కె.రాజేంద్ర బృందం చేరుకుంది. అనంతరం తాము ఏసీబీ అధికారులమని, మొత్తం రికార్డులు తనిఖీ చేయడంతోపాటు దర్యాప్తుకు సహకరించాలని సబ్‌రిజిస్ట్రర్ రాజుకు కోరగా, ఎక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేసి కార్యాలయాన్ని ఏసీబీ అధికారులకు అప్పగించారు.

09/12/2018 - 22:29

కురుపాం, సెప్టెంబర్ 12: తన ఉపాధి కోసం పెట్టుకున్న దుకాణాన్ని తొలగించమన్నందుకు మనస్థాపానికి గురై గిరిజన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం కురుపాం మోడల్ స్కూల్ గేటు బయట గడబంటి శ్రీనివాస్ అనే గిరిజన యువకుడు చిన్నపాటి దుకాణాన్ని నడుపుతున్నాడు.

09/12/2018 - 22:26

గుంటూరు (అరండట్‌పేట) సెప్టెంబర్ 12: ఏమీ తెలియని వ్యక్తుల్లా రోడ్ల వెంట, అపార్ట్‌మెంట్‌లలో అద్దెకు ఇళ్లు కావాలని తిరుగుతారు.. సాయంత్రానికి తమ పని కానిచ్చేస్తారు... ఎంత దొరికితే అంతా మొత్తం దోచుకుని తమ సొంత ప్రాంతానికి వెళ్లి జల్సాలు చేస్తారు. ఇదీ ప్రస్తుతం రాజధాని పరిధిలో సంచరిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా పని.

09/12/2018 - 22:25

గుంటూరు (అరండల్‌పేట) సెప్టెంబర్ 12: అర్బన్ పరిధిలో ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిసియస్ పోలీసులు తెలిపారు. బుధవారం సిసియస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అదనపు ఎస్పీ రాఘవ కేసు వివరాలను వెల్లడించారు.

09/12/2018 - 22:24

గుంటూరు (అరండల్‌పేట) సెప్టెంబర్ 12: చెడు వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 4 లక్షల రూపాయల విలువచేసే 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీసులు బుధవారం వెల్లడించారు.

09/12/2018 - 22:15

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 12: సామన్య పేద వర్గాల బతుకులను చిద్రం చేస్తూ రాయలసీమ జిల్లాల్లో నిర్వహిస్తున్న మట్కాను అనంతపురం వన్‌టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన మట్కా నిర్వాహకులతో సహా 20 మందిని అరెస్టు చేసి, వారి నుండి రూ.47 లక్షలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్, 32 సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నారు.

09/12/2018 - 22:12

పామిడి, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని రామగిరి గ్రామంలో వివాహిత తిరుపతమ్మ (35) మృతి వివాదస్పదంగా మారింది. తిరుపతమ్మ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, సంసారం విషయంలో బార్య భర్తలు వాదులాడుకున్నారని ఈక్రమంలో భర్త వడ్డే సుధాకర్ ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేశాడని, మా అమ్మ కేకలు వేయటంతో పారిపోయాడంటూ బుధవారం మృతురాలి సోదరి వడ్డే నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

09/12/2018 - 22:11

ధర్మవరం, సెప్టెంబర్ 12: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో శ్రీనివాసులు అనే నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు.

09/12/2018 - 02:33

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా ఎస్‌ఐ రాణి బక్కమంతుల గూడెంకు చెందిన రైతుల నుంచి 8 వేల రూపాయలు లంచం తీసుకుంటూ మంగళవారం రాత్రి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.

Pages