S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/25/2018 - 23:08

ముజఫర్‌పుర్ (బిహార్), ఆగస్టు 25: భారత్ కీర్తి ప్రతిష్టలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాందీపై స్థానిక కోర్టులో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. రాహుల్‌గాంధీపై పరువునష్టం దావా కేసును సుధీర్ కుమార్ ఒజా అనే న్యాయవాది దాఖలు చేశారు. ఈ కేసును చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కార్యాయలంలో దాఖలు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 4వ తేదీన విచారణకు రానుంది.

08/25/2018 - 21:46

గుంటూరు, ఆగస్టు 24: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 13 మంది దొంగలను అరెస్ట్ చేసి 3 కోట్ల రూపాయల విలువైన పురాతన పంచలోహ విగ్రహాలను గుంటూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రూరల్ ఎస్‌పి కార్యాలయంలో రూరల్ జిల్లా అడిషనల్ ఎస్‌పి ఎం వెంకటేశ్వర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది చుండూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన పంచలోహ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

08/25/2018 - 03:28

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఎయిర్ సెల్- మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోమారు విచారించింది. సుమారు ఆరు గంటలపాటు ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. విశ్వసనీయవర్గాల కథనం మేరకు న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోని విచారణాధికారి ఎదుట శుక్రవారం హాజరైన చిదంబరం నుంచి ఈడీ వాగ్మూలాన్ని రికార్డు చేసింది.

08/25/2018 - 02:51

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి దాఖలైన కేసులో తీర్పును సుప్రీం రిజర్వ్‌లో పెట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలో జస్టిస్ ఎంఏ ఖాన్వీకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు సంబంధిత పిటిషన్లను విచారించింది.

08/25/2018 - 02:48

న్యూఢిల్లీ, ఆగస్టు 24: హర్యానాలో 70 ఏళ్ల దళితుడు, దివ్యాంగురాలైన ఆమె కుమార్తె సజీవ దహనం కేసులో దోషులైన 15 మందికి హైకోర్టులో చుక్కెదురైంది. జాట్ సామాజిక వర్గానికి చెందిన 15 మంది ముద్దాయిలు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. హర్యానాలోని హిసార్ జిల్లా మిర్చ్‌పూర్ గ్రామంలో 2010లో ఈ హత్యలు చోటుచేసుకున్నాయి.

08/25/2018 - 02:46

న్యూఢిల్లీ,ఆగస్టు 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల స్ధానిక మత్స్యకారుల ఉపాధి కోల్పోతున్నారని దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలవరం అథారిటీ, సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ కోల్‌కతాలకు జాతీయ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.

08/25/2018 - 01:53

సూళ్లూరుపేట, ఆగస్టు 24: ఏటీఎంలలో మోసాలకు పాల్పడిన కస్టోడియన్లు కటకటాల పాలయ్యారు. నగదు స్వాహాకు పాల్పడిన కస్టోడియన్లు వి.జగదీష్, సీహెచ్.కోటేశ్వరావు, ఎ.మునికృష్ణలను శుక్రవారం అరెస్ట్ చేసి, వారినుంచి రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీ ఎస్పీ రాంబాబు వివరాలు వెల్లడించారు.

08/25/2018 - 02:08

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రాబ్రీ దేవిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ నమోదు చేసింది. ఐఆర్‌సీటీసీ హోటల్స్ కేటాయింపులో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, భారీగా నగదు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.

08/25/2018 - 02:05

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య సీట్ల కౌనె్సలింగ్‌కు సంబంధించిన జీవో నెం. 550ను యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన జీవో నెంబరు 550 సరైందేనని, రాజ్యాంగ బద్ధంగానే ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

08/25/2018 - 01:14

పెనుకొండ, ఆగస్టు 24: అనంతపురం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ మండలం సత్తార్‌పల్లి సమీపంలో రెండు బొలేరో వాహనాలు ఢీకొనడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లికి వెళ్తున్న వీరంతా మృత్యువాతపడడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages