S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/25/2018 - 00:14

మంచిర్యాల, ఆగస్టు 24: మందమర్రి నుండి మహారాష్టక్రు తరలిస్తున్న సబ్సిడీ బియ్యాన్ని రామగుండం టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. మహారాష్టల్రోని వీరూర్‌కు రైలులో బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేస్తుండగా 15క్వింటాళ్ల సబ్సిడీ బియ్యా న్ని పట్టుకున్నట్లుగా టాస్క్ఫోర్సు సీఐ బుద్దెస్వామి తెలిపారు. వీటి విలువ రూ.15వేలు ఉంటుందన్నారు.

08/24/2018 - 05:50

గుంటూరు (లీగల్), ఆగస్టు 23: మైనర్ అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు గురువారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... స్థానిక పొన్నూరు రోడ్డు సాయిబాబా కాలనీకి చెందిన షేక్ ఖాజావలి, అదే ప్రాంతానికి చెందిన మైనర్‌పై సంఘటనకు మూడు నెలల క్రితం నుండి లైంగికదాడి చేసేవాడు.

08/24/2018 - 04:42

కర్నూలు, ఆగస్టు 23: మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బాలికపై అత్యాచారం జరిపాడు ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ భర్త. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణం కర్నూలు నగరంలో వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

08/24/2018 - 04:39

అవుకు, అగస్టు 23: ఈసీ ఇచ్చేందుకు ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా అవుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కె.కిరణ్‌కుమార్‌రెడ్డిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అవుకు మండలం గుండ్లసింగవరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి ఈసీ, ఆర్‌హెచ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే రూ.

08/24/2018 - 03:23

హైదరాబాద్, ఆగస్టు 23: జిఎస్‌టి తగ్గించినా అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులపై తూనికల కొలతల శాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. గ్రేటర్ పరిధిలో షాపింగ్ మాల్స్ యజమానులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలకు కసరత్తు చేస్తోంది. షాపింగ్ మాల్స్‌లో వస్తువులు అధిక ధరలకు అమ్ముతున్నారని భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.

08/24/2018 - 02:52

విశాఖపట్నం, ఆగస్టు 23: చిన్నకారు రైతుకు రుణం మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన బ్యాంకు మేనేజర్‌కు విశాఖలోని సీబీఐ కేసులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.సత్యప్రభాకర్ జైలు, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కాకరాలపుట్టు గ్రామానికి చెందిన రైతుకు పాడిపరిశ్రమ నిమిత్తం రూ.2 లక్షల రుణం మంజూరైంది.

08/24/2018 - 01:42

న్యూఢిల్లీ: మెడికల్ కోర్సుల కౌనె్సలింగ్ ప్రక్రియలో జీవో నెం.550పై శుక్రవారం సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వనుంది. ఈ జీవోపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ అరు ణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వైద్య విద్యా కోర్సుల కౌనె్సలింగ్‌కు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కోరింది.

08/24/2018 - 01:29

సహకరించిన ఎస్సై తల్లికి మూడేళ్ల జైలు

08/24/2018 - 01:35

హైదరాబాద్/ హయత్‌నగర్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలో పరువు హత్య కలకలం రేపింది. ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్నతండ్రే కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఆ అమ్మాయి ఏడు నెలల గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా దారుణానికి ఒడిగట్టాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఎల్లంకి సురేష్ (27) వృత్తిరీత్యా మేస్ర్తి.

08/23/2018 - 21:10

విజయనగరం, ఆగస్టు 22: అమ్మతనానికి అవమానం మిగిల్చేలా విజయనగరంలో ఓ మహిళ తన కుమారుడిని కడతేర్చింది. పోలీసుల వివరాల మేరకు- ఎం.కొండలరావు, వెంకటపద్మావతి దంపతులు. గాయత్రినగర్‌లో ఉంటున్న వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు హరి భగవాన్ ఇంటర్మీడియట్ చదువుతుండగా, కుమార్తె ఉమాదేవి పదో తరగతి చదువుతోంది. భార్య పద్మావతితో విభేదాలు రావడంతో భర్త కొండలరావు ఆరేళ్ల కిందటే విడాకులు ఇచ్చాడు.

Pages