S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/24/2018 - 00:07

న్యూఢిల్లీ, జూలై 23: క్రిమినల్ కేసులో దోషిగా తేలిన ప్రజాప్రతినిధికి అప్పీలేట్ కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిన మరుక్షణమే అతడు అనర్హుడవుతాడని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లీల్లీ థామస్ కేసులో 2013న వెలువడిన తీర్పును ‘లోక్ ప్రహారీ’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో సవాల్ చేసింది.

07/23/2018 - 23:59

రామాయంపేట, జూలై 23: నిద్రమత్తులో కారులో ప్రయాణిస్తున్న వారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికి అక్కడే మృత్యువాత చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈసంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ శివారులోని అడిగాస్ హోటల్ వద్ద చోటుచేసుకుంది.

07/23/2018 - 22:55

అద్దంకి, జూలై 23: ఏకంగా 7.40కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్లను మాయం చేసి, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకుని హాయిగా జీవిద్దామనుకున్న మాయగాడు కటకటాలపాలయ్యాడు. సెల్‌ఫోన్ల దొంగను పోలీసులు అరెస్టు చేసి సోమవారం మధ్యాహ్నం అద్దంకి సర్కిల్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

07/23/2018 - 22:28

నరసన్నపేట,జూలై 23: మండల కేంద్రంలోని సత్యవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి ఒడిస్సాకు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఇదే సమయంలో పాఠశాలలకు వెళ్లేవాహనాలు ఎక్కువగా రద్దీగా ఉండే ఈప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇదే సమయంలో వాహన రాకపోకలకు అంతరాయం కల్గింది.

07/23/2018 - 04:21

జగిత్యాల, జూలై 22: గత 5రోజుల క్రితం జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలోని అరవింద్‌నగర్‌లో కిడ్నాప్, హత్యకు గురైన రౌడీషీటర్ మాద అనిల్‌కుమార్ (21) మృతదేహం ఆదివారం నిజామాబాద్ జిల్లా బాసరలో లభ్యమైంది. జగిత్యాల మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు రౌడీషీటర్ అనిల్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసిన అనంతరం నిజామాబాద్‌లోని ఎస్సారెస్పీ కెనాల్‌లో పడేశారు.

07/23/2018 - 04:20

కాల్వశ్రీరాంపూర్, జూలై 22: కాల్వశ్రీరాంపూర్ మండలంలో శనివారం రాత్రి దొంగనోట్ల ముఠా సభ్యులు పోలీసులకు చిక్కడంతో కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ అధికారులు కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల పోలీసులు ఓదెల మం డలంలోని గుంపులవద్ద దొంగనోటును ముద్రించే యంత్రంతోపాటు కొంత నగ దు అయిన దొంగనోట్లను పట్టుకున్నట్లు సమాచారం. ఈవిషయమై ఆదివారం జిల్లావ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

07/23/2018 - 03:51

కోచి, జూలై 22: ప్రేమ గుడ్డిది. వ్యక్తిగత స్వేచ్ఛ కు సంబంధించిన వ్యవహారం. ప్రేమికులు మోహంతో వెళ్లిపోతే ఏమి చేయగలం. ప్రేమికులను కాలేజీ నుంచి బహిష్కరించడం తగదం టూ ఒక కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. ఒక కాలేజీ యాజమాన్యం తమ కాలేజీలో ఒక యువతిని, ఆమెను ప్రేమించి తీసుకెళ్లిన సీనియర్‌ను కాలేజీని బహిష్కరించింది.

07/23/2018 - 03:21

ఉత్తరప్రదేశ్, జూలై 22: ఇది యూపీకి చెందిన ఒక మహిళ హృదయవిదారకరమైన ఘటన. ఒక పోలీసు స్టేషన్‌కు అబార్షన్ తర్వాత పిండాన్ని సంచిలో పెట్టుకుని వచ్చింది. ఇది చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే, తనను ఒక వ్యక్తి ఆరు నెలల క్రితం అత్యాచారం చేశాడని, దీని ఫలితంగా గర్భందాల్చినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

07/23/2018 - 03:17

న్యూఢిల్లీ, జూలై 22: హోటళ్లు, సంస్థలు, కంపెనీలు ఎడాపెడా భూగర్భ జలాలను తోడడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, కేంద్ర భూగర్భ జలాల అథారిటీ అనుమతి లేకుండా గొట్టపు బావుల తవ్వకానికి అననుమతి ఇవ్వవద్దని కేంద్రాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలను ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్ జారీ చేశారు.

07/23/2018 - 02:27

కల చెదిరింది
కన్నీరే.. మిగిలింది
ఆంధ్రా నుంచి అమీర్‌పేట కోచింగ్ సెంటర్‌లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ కలెక్టర్ అవుదామని
కల కన్నాడా యువకుడు. హైదరాబాద్ లో చదివి తన కల సాకారం చేసుకుందామని ఆశయంగా
పెట్టుకున్నాడు. ఈలోపు మిత్రుని జన్మదినోత్సవ వేడుకల్లో మద్యం సేవించి అతి వేగంగా వాహనం
నడపడంతో జీవిత కథపరిసమాప్తమైంది. కన్నకొడుకు

Pages