S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/23/2018 - 00:26

పెద్దాపురం, మే 22: పట్టణంలో దొంగ నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక లక్షా 42వేల 600 విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు తెలిపారు.

05/23/2018 - 00:25

కొత్తపేట, మే 22: మండల పరిధిలోని అవిడి శివారు అమలాపురం ప్రధాన రహదారిపై మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై హరీష్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని మోడేకుర్రుకు చెందిన నంద్యాల సత్యనారాయణ (60), బద్దిరెడ్డి సూర్యనారాయణ (60) మృతి చెందగా, గంగుమళ్ల లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై తెలిపారు.

05/23/2018 - 00:17

రుద్రవరం మే 22: మండలంలోని చిలుకలూరు గ్రామంలో బట్టలు ఉతికేందుకు వక్కిలేరు కుంట వద్దకు వెళ్లి కుటలో పడి తల్లీకూతురు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. వేసవి సెలవులు కావడంతో చిలుకలూరుకు చెందిన చాంద్‌బీబీ ఇంటికి నంద్యాల పట్టణం, గుట్టవీధికి చెందిన ఆమె అక్క హుసేన్ భాను (43), ఆమె కుమార్తె హబిబూన్ (14) వారం రోజుల క్రితం వచ్చారు.

05/23/2018 - 00:14

నందికొట్కూరు, మే 22:పగిడ్యాల మండల పరిధిలోని సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు నాగిరెడ్డి(30) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ముచ్చుమర్రి ఎస్‌ఐ కిరణ్‌బాబు తెలిపిన వివారాలు.. గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఐదెకరాల సొంత పొలంతో పాటు ముంపునకు గురైన మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేశారు. మినుము, శెనగ పంటల సాగు కోసం దాదాపు రూ.

05/23/2018 - 00:11

గజపతినగరం,మే22: ఉద్యోగం ఆశ చూపి నిరుద్యోగి నుండి లక్షలాది రూపాయలు స్వాహా చేసిన నిందితుడుని స్దానిక పోలీస్‌ష్టేషన్ హెచ్ సి పెదమజ్జి శ్రీను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దత్తిరాజేరు మండలం తిమిటేరు బూర్జివలస గ్రామానికి చెందిన చిప్పాడ శ్రీనువాసరావు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామం పరిధిలో గల మామిడిబందకాలనీలో గత కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు.

05/23/2018 - 00:01

పరిగి, మే 22 : మండల పరిధిలోని కొడిగెనహళ్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ఓ వేపచెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఆ వ్యక్తి ఉరేసుకుని నాలుగు రోజులు అయి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

05/23/2018 - 00:00

గుంతకల్లు, మే 22 : ప్రయాణంలో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి 8 తులాల బంగారు నగలు చోరీ చేసిన ఘటన మంగళవారం పట్టణంలో సంచలనం రేపింది. విడపనకల్లు మండలం డోనేకల్లుకు చెందిన లక్ష్మీదేవి గుంతకల్లులోని తన కుమార్తె ఇంటికి వస్తూ బళ్లారి నుంచి గుంతకల్లుకు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో డోనేకల్లులో ఎక్కింది.

05/22/2018 - 23:51

గుంటూరు, మే 22: నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాలను మంగళవారం అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.

05/22/2018 - 23:42

తిరుపతి, మే 22: స్థానిక పెద్దకాపు లే అవుట్‌లోని కుర్లాన్ బెడ్స్ ఫర్నీచర్ దుకాణంలో ఈ యేడాది ఏప్రిల్ 15వ తేదీన చోరీకి పాల్పడిన గుత్తా శ్రీనివాసులును తిరుచానూరు బైపాస్ రోడ్డులోని కొత్తపాళెం లేఅవుట్‌లో ఉన్న సూర్యతేజ టవర్స్ వద్ద అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆ దుకాణంలో చోరీ చేసిన రూ.

05/22/2018 - 01:05

మానకొండూర్, మే 21: మానకొండూర్ గ్రామానికి చెందిన దాసరి హరిష్ అనే యువకుడు మద్యం సేవించి కారునడుపుతు సోమవారం పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన కారుడ్రైవర్‌ను కోర్టులో స్ధానిక పోలీసులు హాజరుపరుచగా ఏడు రోజులు జైలు శిక్ష, 2వేల రూపాయాల జరిమానా విధించినట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. యువకులు మద్యం తాగి వహనాలు నడపవద్దని సీఐ సూచించారు.

Pages