S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/12/2020 - 00:29

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను మియాపూర్ న్యా యస్థానం తిరస్కరించింది. నార్సిం గి ఠాణా పరిధిలోని మియాపూర్ గడ్డలో అనుమతి లేకుం డా డ్రోన్ కెమెరా ఉపయోగించిన కేసులో రేవంత్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 6వ తేదీ న నార్సింగి పోలీసులు అతనిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు.

03/11/2020 - 07:18

నల్లగొండ, మార్చి 10: ప్రేమవివాహం నేపథ్యంలో హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసును జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టులో మంగళవారం విచారణకు రాగా, ఎనిమిది మంది నిందితులకు ఇద్దరు హాజరుకాలేకపోవడంతో ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలులో జాప్యం నెలకొనడంతో కేసును ఈనెల 23కు కోర్టు వాయిదా వేసింది.

03/11/2020 - 07:38

హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని, రేవంత్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. పాత కేసుల్లో రేవంత్‌పై పీటీ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) వారెంట్‌ను హైదరాబాద్ పోలీసులు అడిగారని, పోలీసుల తరపు లాయర్ పేర్కొన్నారు.

03/11/2020 - 06:33

షాద్‌నగర్ రూరల్, మార్చి 10: అనుమానాస్పద స్థితిలో వ్యాపారి మృతిచెందిన సంఘటన పట్టణంలోని పరిగి రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 9:30గంటలకు వెంకటేశ్వర కాలనీలోని తన నివాసం నుంచి మృతుడు షాపునకు వెళ్తున్నానని చెప్పి వెళ్లినట్లు భార్య మంజుల తెలిపారు.

03/11/2020 - 06:28

జీడిమెట్ల, మార్చి 10: వాటర్ టబ్బులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం కొంపల్లి, మాలకుంటబావి కాలనీలో నివాసముండే వెంకట్రావ్ కుమార్తె భాగ్యవతి (3) ఇంటి ముందు ఆడుకుంటుందని అనారు. మూతలేని వాటర్ టబ్బులో ప్రమాదవశాత్తు పడి పోయిందని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు చిన్నారి పాప కోసం చుట్టు పక్కల ఎంతవెతికినా దొరకలేదని అన్నారు.

03/10/2020 - 05:08

మక్తల్, మార్చి 9: పశువైద్యాధికారి దిశను అత్యంత దారుణంగా చంపిన వారిలో ఒకరైన 4వ ముద్దాయి గురుడిగండ్ల వాసి చింతకుంట చెన్నకేశవులు తండ్రి చింతకుంట కుర్మయ్య (48) ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మక్తల్ ఎస్సై అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

03/10/2020 - 04:58

మదనపల్లె, మార్చి 9: ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటమునిగి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

03/10/2020 - 03:59

*చిత్రం...జార్ఖండ్‌లో సోమవారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ట్రక్కును ఢీకొని ధ్వంసమైన బస్సు

03/10/2020 - 01:55

రాజేంద్రనగర్, మార్చి 9: యజమాని నిర్లక్ష్యంతో ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన నగర శివారు కాటేదాన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. బిహార్‌కు చెందిన సూరజ్ మూడు నెలలుగా కాటేదాన్‌లోని స్వస్తిక్ ఆయిల్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఫ్యాక్టరీలోకి నీళ్లు చేరాయి.

03/10/2020 - 01:54

జీడిమెట్ల, మార్చి 9: మూడవ అంతస్తు పైనుంచి పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పైపులైన్ రోడ్డు లక్ష్మిగంగా ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నితిన్ రెడ్డి కుమారుడు శ్రీహన్ రెడ్డి (6) ప్లే స్కూల్‌కి వెళ్తున్నాడు.

Pages