S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/29/2018 - 23:38

ఆగిరిపల్లి, జూన్ 29: ఇంజనీరింగ్ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం చేసి, దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి బెదిరించిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్న విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను చిత్రీకరించి, విద్యార్థినిని బెదిరించారు.

06/29/2018 - 05:59

చెన్నూరు, జూన్ 28: కడప-కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె టోల్‌గేట్ వద్ద గురువారం తెల్లవారు జామున లారీ -కారు ఢీ కొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

06/29/2018 - 04:39

హైదరాబాద్, జూన్ 28: ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రయను అనర్హురాలిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు తిరస్కరించింది.

06/29/2018 - 04:34

హైదరాబాద్, జూన్ 28: రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌సైట్ లోని భూ పత్రాల సర్టిఫైడ్ ల్యాండ్ కాపీల నుంచి వేలిముద్రలు డౌన్‌లోడ్ చేసి తద్వారా ఓడా ఫోన్ సిమ్ కార్డులు వేల సంఖ్యలో యాక్టివేట్ చేసిన నిందితుడిని ఐబి, కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు విచారిస్తున్నారు.

06/29/2018 - 21:30

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మనె్నల్లి ఆశీర్వాదం (52)కు నాంపల్లి మొదటి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. యూసఫ్‌గూడ బిజెఆర్ నగర్‌కు చెందిన నిందితుడు ఆశీర్వాదం 15 ఏళ్ల మైనర్ బాలిక నగ్న ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు.

06/29/2018 - 04:29

హైదరాబాద్, జూన్ 28: దేశ, విదేశాల్లో పేరొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మెడిసిన్‌లో ఎంబిబిఎస్, ఎండి కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు భారీ మోసానికి తెరదీశారు. ఇండియా, నేపాల్, తదితర దేశాల్లో డీమ్డ్ యూనివర్శిటీలు, టాప్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద మెడిసిన్ సీట్లు ఇప్పిస్తామంటూ హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి రూ.81 లక్షలు, ఢిల్లీలో రూ.68 లక్షలు వసూలు చేశారు.

06/29/2018 - 04:24

హైదరాబాద్, జూన్ 28: రాజు కుకునూరు అనే వ్యిక్తి తన కిడ్నీని రత్నాకర్ పెద్దాడ అనే మరొక వ్యక్తికి దానం ఇచ్చేందుకు హైకోర్టు గురువారం అనుమతించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ. రాజశేఖరరెడ్డి ఈ మేరకు తీర్పు చెప్పారు. రత్నాకర్ పెద్దాడ వద్ద రాజు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రత్నాకర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయనను కాపాడేందుకు రాజు తన రెండు కిడ్నీలలో ఒక కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చాడు.

06/29/2018 - 04:07

ఆదిలాబాద్,జూన్ 28: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శివాజీ చౌహన్ (48) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.

06/29/2018 - 04:55

ముంబాయి: అవినీతి కేసులో ఆదాయం పన్ను శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. 2010లో ఈ ఇద్దరు అధికారులు 1.7 కోట్ల సొమ్మును ముట్టచెప్పాలంటూ ఒక బిల్డర్‌ను బెదిరించినట్లు సిబిఐ అభియోగాలు మోపింది. శిక్ష పడిన వారిలో అదనపు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు.

06/29/2018 - 01:12

మార్కాపురం, జూన్ 28 : ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయించుకొని కొన్నాళ్లపాటు ప్రశాంతంగా జీవిద్దామనే అభిప్రాయంతో బెంగళూరుకు వెళ్తూ మార్గం మధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో బేస్తవారపేటకు చెందిన భార్యభర్తలు మృతి చెందగా వారి కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుఝామున జరిగింది.

Pages