S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/29/2018 - 00:37

హైదరాబాద్, జూన్ 28; ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఒక వారంలోగా ఏర్పాటు చేయాలని, మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో సంబంధిత పరిపాలనను సాగించే విధంగా ప్రకటన చేయాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదోన్నతల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఏపీ ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు.

06/29/2018 - 00:16

ధర్మవరం, జూన్ 28 : పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో 55 సంవత్సరాలు వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి గురువారం రైలు కింద పడి మృతి చెందాడు. ప్రయాణీకులు, ట్రాక్‌మెన్ నారాయణస్వామి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. రైల్వే పట్టాలపై ఆ వ్యక్తి తల, మొండెం వేరు కావడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గుర్తు తెలియని వ్యక్తిగా నిర్దారించారు.

06/28/2018 - 23:47

కేతేపల్లి, జూన్ 28: చేపల వేటకు చెరువులోకి వెళ్లిన మత్స్యకార్మికుడు తెప్ప తిరగబడటంతో మృతిచెందిన సంఘటన శాలిగౌరారం మండల కేంద్రంలో గురువారం జరిగింది.

06/28/2018 - 05:51

వనస్థలిపురం,జూన్ 27: ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద 12 చాకులు,రెండు సెల్‌ఫోన్‌లు, ఒక మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం..

06/27/2018 - 05:57

చందుర్తి, జూన్ 26: ప్రియుడి మోసంతో ప్రియురాలు నిద్రమాత్రలు మింగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి అనే యువకుడు కామారెడ్డి జిల్లాకు చెందిన సత్య అనే యువతిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు నాలుగు రోజుల క్రితం మర్రిగడ్డకు చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

06/27/2018 - 04:02

నల్లగొండ, జూన్ 26: రైతుబంధు పథకంతో సామాన్య రైతులకంటే పెద్ద రైతులు, భూస్వాములకే అధిక లాభం జరుగుతుందని పథకంలో మార్పులు చేయాలని కోరుతు నల్లగొండ జిల్లాకు చెందిన పి.యాదగిరిరెడ్డి హైకోర్టుకు సమర్పించిన లేఖను మంగళవారం ప్రజాప్రయోజనాల వాజ్యంగా విచారణకు స్వీకరించింది.

06/27/2018 - 02:26

పాలకొల్లు, జూన్ 26: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం రోడ్డులో దిగమర్రు వద్ద 2017, జనవరి 18న టాటా సపారీ మోటారు సైకిల్‌పై వెడుతున్న శ్రీ గౌతమి, ఆమె సోదరి పావనిని డీకొట్టడంతో శ్రీ గౌతమి మృతి చెందింది. పావని ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉంది. ఈ మృతిని అప్పుడు పోలీసులు ప్రమాదంగానే ప్రకటించారు.

06/27/2018 - 00:40

గుర్రంపోడు, జూన్ 26: మండలంలోని నడికుడ గ్రామంలో మంగళవారం సాయంత్రం కట్టేబోయిన వెంకటయ్య(35)కు ప్రమాదవశాత్తు విద్యుత్ సర్వీస్ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై భార్య పుష్పలత ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు

06/27/2018 - 00:33

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలో వెనుకబడిన కులాల (బీసీ) గణాంకాల వివరాలు తేల్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబందించి బిసి రిజర్వేషన్లు శాతం ఎంత అన్నది తేల్చాలని కాంగ్రెస్ నేతలు బి రవీందర్‌నాథ్, దాసోజి శ్రవణ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

06/26/2018 - 23:49

భద్రాచలం టౌన్, జూన్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల మండలంలో మావోయిస్టులకు కొరియర్లుగా పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు..

Pages