S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/18/2018 - 04:31

కోటవురట్ల, జూన్ 17: అక్రమంగా కబేళాలకు పశువులను తరలిస్తున్న లారీపై స్థానిక పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి 67 పశువులను స్వాదీనం చేసుకున్నారు. మండలంలో యండపల్లి వద్ద ఆదివారం జరిగిన ఈసంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై బి. మదుసూధనరావు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి.

06/18/2018 - 04:26

మచిలీపట్నం, జూన్ 17: పోలీసులు తనను తీవ్రంగా హింసించారంటూ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దాసరి నాగేంద్ర ప్రసాద్ బాబు చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేశామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.

06/18/2018 - 04:21

ఉప్పల్, జూన్ 17: భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ సాయి మారుతీనగర్‌లో నివసిస్తున్న నెల్లూరు లక్ష్మణ్ (26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతడు ఎయిల్‌టెల్‌లో పనిచేస్తున్న భావన (25)ను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో బాల్య స్నేహితుడైన రఘు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

06/18/2018 - 00:06

కాకినాడ, జూన్ 17: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద అదివారం సముద్రంలో స్నానం చేస్తూ నైజీరియా దేశానికి చెందిన ఇరువురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల్లో ఒకరి మృతదేహం తీరానికి కొట్టుకురాగా, మరో విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

06/17/2018 - 22:54

ఏర్పేడు, జూన్ 17: ఓ వివాహిత ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని ఇసుకతాగేలి పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఏర్పేడు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

06/17/2018 - 22:51

కురబలకోట, జూన్ 17: నీటి కుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లిన ఓ యువతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో నలుగురు ప్రమాదంలో చిక్కుకోగా సమీపంలో గొర్రెలు మేపుతున్న ఓ యువకుడు వారిని సమయస్ఫూర్తితో కాపాడాడు.

06/17/2018 - 22:50

పుంగనూరు, జూలై 17: పట్టణానికి చెందిన మహేష్(20) కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు తన కుమారుని మృతదేహానికి పుంగనూరు పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించేశారు. కుమారుని స్నేహితుడు అదే తరహాలో ఈనెల 15న మృతిచెందాడు. దీనిపై మహేష్ తల్లికి కుమారుడి మృతిపై పలు అనుమానాలు రావడంతో ఈనెల 15న మార్కాపురం డిఎస్‌పి రామాంజునేయులకు తల్లి పద్మజ ఫిర్యాదు చేసింది.

06/17/2018 - 22:48

అర్థవీడు, జూన్ 17: అంబుతో దాడి చేసి దారుణంగా తమ్ముడిని అన్న హత్యచేసిన సంఘటన మండలంలోని వెలగలపాయం పంచాయతీ బొమ్మిలింగం చెంచుకాలనీలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన సారె పెద్దయ్య కుమారులు వెంకటేష్, నాగులు మధ్య గడ్డపార విషయంలో మనస్పర్థలు వచ్చాయి.

06/17/2018 - 22:47

సింగరాయకొండ, జూన్ 17: మండల పరిధిలోని పాకల సముద్ర తీరంలో ముగ్గురు యువకులు సరదాగా స్నానానికి వెళ్లగా వారిలో ఒక యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బింగినిపల్లికి చెందిన కోటేశ్వరరావు (18) తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి పాకల సముద్రతీరంలో సరదాగా స్నానానికి వెళ్లారు. పెద్దపెద్ద అలల తాకిడికి కోటేశ్వరరావు సముద్రంలో కొట్టుకుపోయాడు.

06/17/2018 - 22:40

ద్వారకాతిరుమల, జూన్ 17: డబ్బుపై ఆశ .. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కౌజు పిట్టలను కొనుగోలు చేసేందుకు సొమ్ముతో పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఓ వ్యాపారి ఫారంలో పనిచేసే కూలి అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మండలంలోని గుణ్ణంపల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Pages