S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/01/2018 - 02:22

శృంగవరపుకోట, మార్చి 31: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం వెంకటరమణపేట సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మణం చెందారు. శృంగవరపుకోటలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విజయ్(12), లోకేష్(14) పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ద్విచక్రవాహనంపై వస్తున్న గౌరీ శంకర్(24) అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగారు.

04/01/2018 - 02:22

విశాఖపట్నం, మార్చి 31: రైల్లో తరలిస్తున్న దొంగనోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌లో ముద్రితమైన ఈ నోట్లు పశ్చిమబంగ నుంచి తరలిస్తున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను విశాఖ రైల్వే స్టేషన్‌లో శనివారం పట్టుకున్నారు. నోట్ల విలువ రూ.10.2 లక్షలుగా డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

04/01/2018 - 01:38

హైదరాబాద్, మార్చి 31: భూసేకరణ కేసుల్లో నష్టపరిహారాన్ని మళ్లీ నిర్ణయించే విషయమై ఆరు వారాల గడువును విధించాలని, ఈ మేరకు ఆంధ్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలు జిల్లా కందకూరుకు చెందిన ఎస్ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామ్ విచారించి ఈ ఆదేశాలు జారీ చేశారు.

03/31/2018 - 22:56

వెల్దండ, మార్చి 31: వెల్దండ మండలం గుంగాల గ్రామానికి చెందిన ఎనుముల రమేష్(30) అనే వ్యక్తి పది రోజుల క్రితం పెట్రోల్ పోసుకోని అత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ముత్యాల రాంమూర్తి తెలిపారు.

03/31/2018 - 03:55

న్యూఢిల్లీ, మార్చి 30: వితంతువులు, అనాథ మహిళల అభ్యున్నతికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాలిక వివరాలను కేంద్రానికి పంపకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన అంశమని పేర్కొంది.

03/31/2018 - 03:55

న్యూఢిల్లీ, మార్చి 30: దేశవ్యాప్తంగా జైళ్లలో ఖైదీలు పరిమితి కంటే 600 శాతం అధికంగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిం ది. దేశం మొత్తం మీద జైళ్లలో పరిమితికి మించి 1300 మంది ఖైదీలు ఉం టున్నారన్న సమాచారం తెలుసుకున్న కోర్టు ‘ఖైదీలను జంతువుల మాది రిగా జైళ్లలో కుక్కేయడమేంటంటూ’ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

03/31/2018 - 02:37

తాండూరు, మార్చి 30: బషీరాబాద్ మండలం గొటిగకలాన్ గ్రామశివారులోని వాగులో అర్ధరాత్రి వేళ ఇసుకను తరలించే యత్నంలో ట్రాక్టర్ ఢీకొని మహిళా కూలీ మృతిచెందింది. కేసు వివరాలను బషిరాబాద్ ఎస్సై లక్ష్మయ్య, తాండూరు డీఎస్పీ రామచంద్రుడు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి వాగులోనుంచి ఇసుకను తరలించేందుకు కూలీలను ఏర్పాటు చేసుకున్నారు.

03/31/2018 - 02:36

కొడంగల్, మార్చి 30: పెళ్లి చేసుకుని నిండునూరేళ్లు జీవించాలనుకున్న ప్రేమజంట.. పెద్దలకు తమ ప్రేమను చెప్పలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కొడంగల్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవికుమార్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండ ల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన రాజు (19) ఇందనూర్ గ్రామానికి చెందిన రోజా (18) కలిసి రావులపల్లిలో 10వ తరగతి వరకు చదువుకున్నారు.

03/31/2018 - 02:36

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 30: కుటుంబ కలహాలతో తరచూ గొడవ పడుతూ భార్యను గొంతు నులిమి భర్త హత్య చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేవరకొండ సమీపంలోని చింతపల్లికి చెందిన జర్పుల శ్రీను, దేవి (25) దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో నివాసం ఉంటున్నారు. శ్రీను స్థానికంగా డ్రైక్లీనింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు.

03/31/2018 - 02:31

తాండూరు, మార్చి 30: పెద్దేముల్ మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుద్దారంలో విషాదం చోటుచేసుంది. పొలం పనులకు వెళ్లిన తండ్రీ, కొడుకులు గురువారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి గురయ్యారు. చెరుకు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన అనంతయ్య (55), సంతోష్‌కుమార్ (31) ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబీకులు పొలానికి వెళ్లి చూడగా విగత జీవులుగా పొలం గట్టుపై ఉన్న విద్యుత్ కంచె వద్ద పడి ఉన్నారు.

Pages