S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/15/2018 - 00:15

గుత్తి, జూన్ 14 : పట్టణంలోని బీసీ కాలనీలో గురువారం విద్యుదాఘాతంతో సాయిప్రసాద్ మృతి చెందాడు. సాయిప్రసాద్ ప్రైవేట్ హెల్పర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బీసీ కాలనీలో ఓ ఇంటికి విద్యుత్ వైర్లు మారుస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే స్థానికులు ప్రైవేట్ నర్సింగ్‌హోంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

06/14/2018 - 23:57

మంగళగిరి, జూన్ 14: రాష్ట్ర రాజధాని అమరావతి నగర పరిధిలోని పెనుమాక గ్రామంలో గురువారం పట్టపగలు రైతు మేకా వేమారెడ్డి నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. సుమారు కోటిన్నర రూపాయల నగదు, నగలు దోచుకుపోయారు. వేమారెడ్డి, ఆయన కుమారుడు బ్రహ్మారెడ్డి పొలానికి వెళ్లగా, ఇంట్లో వేమారెడ్డి భార్య శివపార్వతి, కోడలు శ్యామల ఉన్న సమయంలో ఈ దోపిడీ జరిగింది.

06/14/2018 - 23:48

హైదరాబాద్, జూన్ 14: కొందరు సినీ తారలను కాల్‌గర్ల్స్‌గా చూపిస్తూ వారి ఫోటోలను, వాటి కింద రేట్లను ఉంచి ఓ వెబ్‌సైట్లో పెట్టిన నిందితుడిని నగర సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సైబర్ క్రైం ఎసిపి రఘువీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/13/2018 - 05:23

పాల్వంచ, జూన్ 12: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో ఓ నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మధ్యప్రదేశ్ డెవొర గ్రామానికి చెందిన రాంపాల్‌కేవత్ (29) గత సంవత్సరం క్రితం పాల్వంచలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కెటిపిఎస్ 7వ దశ కర్మాగారంలో పెయింటర్‌గా పని చేసేందుకు బిహెచ్‌ఇఎల్ కంపెనీకి చెందిన ఒక కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడకు వచ్చి పని చేస్తున్నాడు.

06/13/2018 - 01:38

పామూరు, జూన్ 12: పామూరుకు చెందిన యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగింది. పామూరుకు చెందిన వెంకటరావు, రమాదేవిల ఏకైక కుమారుడు దీపక్ (26) అమెరికాలో ఎంఎస్సీ పూర్తి చేసి గత కొన్ని రోజులుగా టెక్టాస్ నగరంలో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.

06/13/2018 - 01:22

మదనపల్లె, జూన్ 12: మదనపల్లె పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది హత్యకేసులో ఆరుగురు కిరాయి హంతకులను అరెస్టుచేసినట్లు మదనపల్లె డిఎస్‌పి చిదానందరెడ్డి వెల్లడించారు. ఈనెల 2న ప్రదాన నిందితుడు ప్రముఖ న్యాయవాది, భర్త కె.జితేంద్ర(49)ని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపినట్లు డిఎస్‌పి తెలిపారు. స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్‌పి చిదానందరెడ్డి మాట్లాడారు.

06/13/2018 - 00:36

ఉరవకొండ, జూన్ 12 : కట్టుకున్న భార్యను భర్తే దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన మండలంలోని నెరమెట్ల గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నెరమెట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న సునీతమ్మ (32)ను భర్త హనుమంతు ఇంట్లో నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై నరికి హత్య చేశాడు.

06/13/2018 - 00:33

కడప, జూన్ 12: బ్యాంకులోని ఖాతాదారుల డబ్బులు, బంగారు నగలు కాజేసిన కడప జిల్లా పోరుమామిళ్ల ఎస్‌బీఐ క్యాషియర్ గురుమోహన్‌రెడ్డిని కడప పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన సురేష్‌రెడ్డి, కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.56.72 లక్షల నగదు, 1.785 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

06/13/2018 - 00:07

సూర్యాపేట, జూన్ 12: రోడ్డుప్రమాదంలో తండ్రి కొడుకులు మృతిచెందిన విషాద సంఘటన హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి గ్రామశివారులో మంగళవారం జరిగింది.

06/12/2018 - 23:52

కాకుమాను, జూన్ 12: ఓ కామాంధుడు మద్యం మత్తులో వావి వరసలు మరచి తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తె అయిన ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన దురాగతం గుంటూరు జిల్లా మండల కేంద్రమైన కాకుమానులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన కొమరగిరి లక్ష్మయ్య అక్కడ పనులకు స్వస్తిచెప్పి కాకుమానులోని తల్లివద్దకు వచ్చి ఏడాది కాలంగా కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

Pages