S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/30/2018 - 00:43

చర్ల, మార్చి 29: తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామానికి చెందిన ఇర్పా లక్ష్మణ్(28) అలియాస్ భరత్ మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడిగా పని చేసి లొంగిపోయాడు.

03/30/2018 - 00:06

గోల్డ్ కోస్ట్, మార్చి 29: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ బ్రిస్‌బేన్ ఎయిర్‌పోర్టులో ఎనిమిది మంది నకిలీ భారత జర్నలిస్టులు పట్టుబడ్డారు. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జరిగే కామనె్వల్త్ గేమ్స్‌లో కవరేజీ నిమిత్తం వెళ్లిన వారంతా ఇక్కడి ఎయిర్‌పోర్టులో దిగారు. ఈ ఎనిమిది మంది బృందం సభ్యులు తప్పుడు మీడియా అక్రిడిటేషన్‌లతోపాటు మోసపూరిత ధ్రువపత్రాలు కలిగి ఉన్నారని ‘ది గార్డియన్’ పత్రిక పేర్కొంది.

03/29/2018 - 23:53

దమ్మపేట, మార్చి 29: మండల పరిధిలోని రాసూరుపల్లిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై బాధిత బాలిక గురువారం దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం కుక్కునూరు మండలం నల్లబాడుకు చెందిన బాలిక పది రోజుల క్రితం జరిగిన వినాయకపురంలో జరిగిన జాతరకు వచ్చి అక్కడి నుండి మండలంలోని రాసూరుపల్లిలోని తన స్నేహితురాలు ఇంటికి వచ్చింది.

03/29/2018 - 23:53

చండ్రుగొండ, మార్చి 29: చిన్నపాటి వివాదానికి ఆవేశానికి లోనై కన్నతండ్రినే కడతేర్చిన సంఘటన మండలంలోని తుంగారం శివారు సుంకరబంజర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాదావత్ బాలాజీ (50) చిన్న కుమారుడు సురేష్ దాడిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి.

03/29/2018 - 23:49

నంద్యాల, మార్చి 29: నంద్యాల పట్టణ శివారులో ఉన్న బబ్బూరి, వెంకటేశ్వర సీడ్ కంపెనీలపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు విత్తన కంపెనీల్లో రూ.60 లక్షల బీటీ-3 పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ సీఐ జగన్మోహన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

03/29/2018 - 23:47

వెల్దుర్తి, మార్చి 29 : మండల పరిధిలోని రామళ్లకోట గ్రామం సమీపంలో ఉన్న కొండల్లో మైనింగ్ పనులు చేస్తూ జేసీబీ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలంలోని బోయనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు హరి(19) జేసీబీ ఆపరేటర్. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు రాజు(18) హెల్పర్ పని చేస్తుండేవారు.

03/29/2018 - 23:46

మిడుతూరు, మార్చి 29:మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మిదేవి(23) గురువారం క్రిమిసంహారక గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..

03/29/2018 - 22:49

మెదక్, మార్చి 29: మెదక్ పట్టణానికి చెందిన ఒక వివాహితను హత్య చేసి, అనంతరం దహనం చే శారు. మృత దేహాన్ని ద్వారకా గార్డెన్ ఎదురుగా బాబా కాలనీలో పడేశారు. పూర్తిగా కాలి ఉన్న స్థితిలో ఉన్న ఒక మహిళ శవాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. మృతురాలిని పట్టణానికి చెందిన హేమలత (24)గా గుర్తిం చారు. ఆమెను ఎక్కడో హత్య చేసి అనంతరం దహనం చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

03/29/2018 - 04:44

న్యూఢిల్లీ, మార్చి 28: ఏఐఏడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు వివాదంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపివేసింది. రెండాకుల గుర్తు వివాదంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్‌తో కూడిన బెంచ్ పైవిధంగా ఆదేశించింది.

03/29/2018 - 04:17

ఉప్పల్, మార్చి 28: ఉప్పల్ మెట్రో రైలుస్టేషన్‌లో రివాల్వర్ కలకలం సృష్టించింది. అనుమతి లేకుండా కలిగియున్నారనే అభియోగంపై జడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి డ్రైవర్ తోట సతీష్ కుమార్‌ను పోలీసులు అరెస్టుచేసి అతనివద్ద ఎనిమిది రౌండ్ల రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జడ్పీటీసీ నారాయణరెడ్డికి ప్రభుత్వ అనుమతితో లైసెన్స్ రివాల్వర్ ఉంది.

Pages