S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/10/2018 - 22:08

కణేకల్లు, జూన్ 10 : రాయదుర్గం నుంచి ఉరవకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రాయదుర్గంకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ ఖలీల్ (60) ఆదివారం మూర్చవ్యాధితో మృతి చెందాడు. డ్రైవర్ దస్తగిరి తెలిపిన వివరాల మేరకు మృతుడు ఖలీల్ రాయదుర్గం నుంచి ఉరవకొండలో తన కూతురు ఇంటికి బస్సులో వెళ్తుండగా కణేకల్లు శ్రీచిక్కణేశ్వర వడియార్ చేరువుకు సమీపంలోకు రాగానే మూర్చవ్యాధి వచ్చింది.

06/10/2018 - 04:36

పటాన్‌చెరు, జూన్ 9: పట్టణ శివారులలోని తిమ్మక్క చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కార్తిక్‌గౌడ్(18) చందానగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరము చదువుతున్నాడు. అతని తండ్రి యాదగిరి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

06/10/2018 - 04:32

నిజాంసాగర్, జూన్ 9: మండలంలోని మంగ్లూర్ శివారులోని పొలంలో విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా.. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామనికి చెందిన గైని కాడి గోవింద్‌రావు(45) అనే కౌలు రైతు మంగ్లూర్ గ్రామానికి చెందిన గొర్రెకృష్ణారెడ్డి పొలంను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడన్నారు. పక్కనే పొలంలో తుకం పోసి దాని చుట్టు జీఏ వైరును చుట్టి విద్యుత్ సరఫరా చేశారు.

06/10/2018 - 04:26

నిడమనూరు, జూన్ 9: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో సుంకరి ఈదయ్య(48) అనే రైతు అప్పుల బాధ తాళ్లలేక శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం ఈదయ్యకు వ్యవసాయంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు అప్పులు కావడంతో వాటిని తీర్చే స్తోమత లేక శనివారం తెల్లవారు జామున పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.

06/10/2018 - 04:17

కౌటాల, జూన్ 9 : చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన చీలకంటి రామన్న (65) అనే వ్యక్తి మతిస్థిమితం లేక వ్యవసా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు కౌటాల ఏ ఎస్సై హన్మండ్లు పేర్కొన్నారు.

06/10/2018 - 04:02

మేడ్చల్, జూన్ 9: మేడ్చల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అంతే వేగంతో వెనుక వస్తున్న టీప్పర్ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టి కొద్ది దూరం అలాగే లాక్కును వెళ్లి డీవైడర్ పైకి ఎక్కి మధ్యలో ఆగిపోయింది. వివరాల ప్రకారం..

06/10/2018 - 04:01

హైదరాబాద్, జూన్ 9: ఖరీదైన సెల్‌ఫోన్లు కొట్టేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఎంఈఐ నెంబర్లను క్లోనింగ్ చేయడం ద్వారా వాటిని పలు రాష్ట్రాలు, బ్యాంకాగ్ దేశానికి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు.

06/10/2018 - 03:44

కూసుమంచి, జూన్ 9: కూసుమంచి మండలం చౌటపల్లి శివారు బండమీది తండాలో శనివారం తెల్లవారుజామున గుండాల ఏరియా దళ కమాండర్ బోడ భీముడు అలియాస్ సుధాకరన్నను పార్టీ సానుభూతి పరుడైన మచ్చు నాయక్ ఇంట్లో ఉండగా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుఝామున మచ్చు నాయక్ ఇంటిని చుట్టుముట్టి భీముడుతో పాటు మచ్చునాయక్‌ను కూడా అదుపులోకి తీసుకుని కూసుమంచి స్టేషన్‌కు తరలించారు.

06/10/2018 - 03:32

చింతూరు, జూన్ 9: మండల పరిధిలోని కాటుకపల్లి - ఏడుగుర్రాలపల్లి గ్రామాల మధ్య ఓ కారు శనివారం సాయంత్రం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో తరలిస్తున్న గంజాయి రోడ్డుపై వెదజల్లిపడినట్టు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..చింతూరు వైపు నుంచి ఒక కారు భద్రాచలం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఏడుగుర్రాలపల్లి- కాటుకపల్లి గ్రామాల మధ్య కారు టైర్ పంచర్ కావడంతో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది.

06/10/2018 - 03:28

నగిరి, జూన్ 9: నిండ్ర మండలంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరికు వారి ఆత్మహత్యకు దారితీసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డి (55), భార్య లక్ష్మి (45)లు ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Pages