S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/25/2018 - 05:17

భైంసారూరల్,మార్చి24: వటోలి గ్రామానికి చెందిన కొమ్ముల మురళీ (25) యువకుడి ప్రేమ విఫలం చెంది శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్ముల మురళీ కుంటాల మండలం కల్లూర్ గ్రామంలోని ఓ ఫ్రైవేటు దుకాణం నిర్వహిస్తున్నాడు. గతేడాది సారంగాపూర్ మండలం జవుల గ్రామానికి చెందిన సవిత అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయి.

03/25/2018 - 05:06

ఎల్లారెడ్డిపేట, మార్చి 23: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ బస్టాండు ప్రాంతంలో కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని శుక్రవారం ఇసుక లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పదిర గ్రామానికి చెందిన రైతు గోపన్నగారి లస్మయ్య(54) దుర్మరణం పాలయ్యాడు. అతని భార్య రేణుక తీవ్ర గాయాలకు గురైంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు.

03/25/2018 - 04:58

కరీంనగర్ రూరల్, మార్చి 23: కరీంనగర్ రూరల్ మండలంలోని బావుపేట గ్రామానికి చెందిన నిర్మాణ కార్మికుడు ఒరుగంటి మల్లయ్య (55) గురువారం అర్ధరాత్రి మృతి చెందాడని స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. వారి వివరాల ప్రాకారం గురువారం మృతుడు భవన నిర్మాణ పనిచేస్తు అస్వస్థతకు గురికావడంతో మృతి చెందాడని అన్నారు.

03/25/2018 - 04:42

నందిపేట, మార్చి 24: నందిపేట శివార్లలోని పలుగుట్ట సమీపంలో విజయ్‌నగర్ వద్ద శనివారం నిజామాబాద్ నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యభర్తలపై అడవిపంది జరిపిన దాడిలో తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట మండలం కోమట్‌పల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు మగ్గిడి శేఖర్-వాణిలు బైక్‌పై శుక్రవారం నిజామాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లారు.

03/25/2018 - 04:35

పాయకాపురం, మార్చి 24: అనుమానాస్పద స్థితిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. స్టేషన్ సీఐ జగన్మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం న్యూ రాజరాజేశ్వరిపేట ఫార్చ్యూన్ హై అపార్ట్‌మెంట్ 305 ఫ్లాట్‌లో పారెం నాగమణి (60) నివాసముంటుంది. ఈమెకు ముగ్గురు సంతానం.

03/25/2018 - 04:12

కాచిగూడ, మార్చి 24: బ్యాంకులు, ఏటీఎం వద్ద అమాయక ప్రజల దృష్టి మరల్చి వారి ఏటీఎం కార్డులను దొంగిలించి అందులోని డబ్బులను కాజేస్తున్న దొంగను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలను ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేష్ శనివారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

03/25/2018 - 03:28

హైదరాబాద్/జీడిమెట్ల, మార్చి 24: జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పన్నులను వసూలు చే సేందుకు వెళ్లిన కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులను పరిశ్రమ యాజమాని నిర్బంధించిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పారిశ్రామి క వాడలోని వెంకటరత్న మెటల్స్ ప్రైవేటు లిమిటెడ్, రత్న ఎక్స్‌ట్రూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ప రిశ్రమ ఆస్తి పన్ను రూ. 5.38 లక్షల బకాయి పడింది.

03/25/2018 - 02:35

సీలేరు, మార్చి 24: ఒడిశా-్ఛతీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ మీనా విలేఖర్లకు వెల్లడించారు. ఒడిశా-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన తులసిడొంగ్రీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది.

03/25/2018 - 01:07

రాంచీ, మార్చి 24: దాణా కుంభకోణం కేసుల్లో వరుస శిక్షలతో ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా దాణా కుంభకోణం నాల్గవ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.60 లక్షల అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించింది.

03/25/2018 - 00:18

పెబ్బేరు, మార్చి24: మండలంలోని 44వ జాతీయ రహదారిపై లారీ బైక్‌ను ఢీకోన్న సంఘటనలో శనివారం కుర్వి నాగరాజు (27) అనే వ్యక్తి మృతిచెందాడు.

Pages