S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/08/2018 - 00:42

పెద్దపల్లి రూరల్, జూన్ 7: పరీక్ష బాగా రాయలేదనే మనోవేదనతో జీవితంపై విరాక్తి పొందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఉధంతమిది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాలితం గ్రామ పంచాయతీ పరిధిలోని గోపయ్యపల్లి గ్రామానికి చెందిన గణేష్ (20) అనే విద్యార్థి పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్నాడు.

06/08/2018 - 00:28

అయిజ, జూన్ 7: బంధాలు, బంధుత్వాలు, మానవత్వం ఇంకిపోతున్న రోజుల్లో సొంత అన్నదమ్ములు భూముల పంపకాల్లో ఒకరిపై ఒకరు దాడులకు దిగి ఏకంగా రెండు కాళ్లను నరికివేసిన వైనం.. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అయిజ పోలీసుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అయిజ పట్టణానికి చెందిన యాకోబు, స్వామిదాసులు అన్నదమ్ములు.

06/08/2018 - 00:24

కడెం, జూన్ 7: కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల వెంకట్‌నగర్ గ్రామానికి చెందిన కొమురం రాము(50) అనే గిరిజనుడు చేపలవేటకై కడెం జలాశయంలోకి వెళ్లి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల వెంకట్‌నగర్ గ్రామానికి చెందిన కొమురం రాము బుధవారం సాయంత్రం కడెం ప్రాజెక్టు జలాశయంలో చేపలవేట కోసం వెళ్లాడు.

06/08/2018 - 00:22

కౌటాల, జూన్ 7: ఇటీవల వరుస మెరుపు దాడులతో అక్రమార్కుల భరతం పడుతున్న టాస్క్ఫోర్సు బృందం తాజాగా గురువారం చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఉదయం 4 గంటలకు టాస్క్ ఫోర్సు సి ఐ అల్లం రాంబాబు నేతృత్వంలోని చింతలమానేపల్లి ఎస్సై రాజ్‌కుమార్ తో కలిసి గూడెం గ్రామానికి చేరుకొని అక్కడ పక్కా సమాచారం మేరకు అనుమానిత ఇండ్లలో సోదాలు నిర్వహించింది.

06/08/2018 - 00:06

ఒంగోలు, జూన్ 7: ఒంగోలు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 73 మందిని ఒంగోలు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది గుర్తించి వారిని గురువారం ఒంగోలులోని మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి సియం వాణిశ్రీ ముందు హాజరు పరచగా జడ్జి వాణిశ్రీ వారిలో పలువురికి జైలు శిక్ష , జరిమానా విధించారు.

06/07/2018 - 23:57

తిరుపతి, జూన్ 7: నీట్ పరీక్షలో క్వాలిఫై కాలేకపోయాన్న ఆవేదనతో తిరుపతి కొర్లగుంటకు చెందిన కె.బాలాజీ (20) అనే విద్యార్థి ఇంటిలోనే గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు కొర్లగుంటలో నివాసం ఉంటున్న వనజాకుమారి రెండో కుమారుడు కె.బాలాజీ (20) నీట్ పరీక్ష రాశాడు. అయితే అందులో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాలాజీ వౌనంగా ఉన్నాడు.

06/07/2018 - 23:49

ఎమ్మిగనూరు, జూన్ 7: భర్త, అత్తమాలల వేదింపులు తట్టుకోలేక మనెమ్మ(28) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గోనెగండ్ల మండలం బైలుప్పులు గ్రామానికి చెందిన మనెమ్మను 10 సంవత్సరాల క్రితం ఎమ్మిగనూరు మండలం మాస్‌మాన్‌దొడ్డిగ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా వారు ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్‌ఎంఎటి కాలనీలో నివాసం ఉంటున్నారు. మనెమ్మకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు.

06/07/2018 - 23:45

ఖమ్మం(క్రైం), జూన్ 7: నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 27మందిపై పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఏసిపి జె సదానిరంజన్ తెలిపారు. గురువారం స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

06/07/2018 - 23:40

చేబ్రోలు, జూన్ 7: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చిన విషాద సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం... కె కోటేశ్వరరావు అనే వ్యక్తి గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తన భార్య రమ్యకృష్ణతో కలిసి చేబ్రోలులో గత కొంతకాలంగా అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు.

06/07/2018 - 23:39

అమరావతి, జూన్ 7: అమరావతి మండల పరిధిలోని మునగోడు గ్రామ సమీపంలో ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు బండారు మల్లిఖార్జునరావు అమరావతి మండలం నుండి ఇసుక లారీతో వెళ్తుండగా జూపూడి చెరువు సమీపంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైకుపై వచ్చి లారీ ఆపి, పోలీసులమని బెదిరించి అతని వద్ద 500 రూపాయలు తీసుకుని పరారయ్యారు. డ్రైవర్ బండారు మల్లిఖార్జునరావు సమయస్ఫూర్తితో అమరావతి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Pages