S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/04/2018 - 00:56

చిత్తూరు, జూన్ 3: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. తల్లీ బిడ్డను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపి తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడి సంఘటన చిత్తూరు రూరల్ మండలం మర్రిగుంటలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకొంది. అనుమానమే పెనుభూతమై ఘోరానికి దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

06/03/2018 - 23:53

నార్కట్‌పల్లి, జూన్ 3: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లికి చెందిన ఎలిగాల లక్ష్మమ్మ (56) జాతీయ రహదారి పక్కగా నడుస్తుండగా సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

06/03/2018 - 23:36

క్రిష్ణగిరి, జూన్ 3:వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదార్‌పురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి-44పై ఆదివారం రెండు మినీ లారీలు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ శశికుమార్(26) మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఐచర్ వాహనం మరమ్మతులకు గురవడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. కొరియర్ లోడు తీసుకుని కర్నాటక వైపు వెళ్తున్న మినీ లారీ రోడ్డుపై నిలిచిపోయిన లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొంది.

06/03/2018 - 23:01

నల్లచెరువు, జూన్ 3: స్థానిక పెట్రోల్‌బంక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తనకల్లు మండలం ఈతోడుకు చెందిన విశ్రాంత ఉద్యోగి శంకర్‌నారాయణ (68) మృతి చెందారు. వివరాలు ఇలా వున్నాయి.

06/03/2018 - 04:43

రెబ్బెన: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి నుండి సోనాపూర్ వెళ్లే దారిలో చోపిడి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. కల్వర్టును ఢీకొన్న బొలెరో పడి (ఎంఎచ్ 34 ఏవీ 1618)వాహనం సుమారు వంద ఫీట్ల లోతులో ఉన్న లోయలో పడి నుజ్జునుజ్జయంది. దీంతో నలుగురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతిచెందారు.

06/03/2018 - 01:05

గుంటూరు, జూన్ 2: ఓ కోల్డ్‌స్టోరేజీ యజమాని వద్ద లంచం తీసుకుంటుండగా గుంటూరు ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కె కేశవరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం, నందిగామ గ్రామంలో గుదే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోల్డ్‌స్టోరేజీ నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని కారణంగా గత కొద్దిరోజుల క్రితం షోకాజ్ నోటీసు జారీచేశారు.

06/02/2018 - 03:49

సిమ్లా, జూన్ 1: హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సిమ్లా నుంచి ఠిక్కర్‌కు వెళుతున్న బస్సు 500 అడుగుల లోతు ఉన్న లోయలోకి పడిపోయింది. డ్రైవర్ మితిమీరి వేగంగా నడపడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని, ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది మరణించారని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నారు.

06/02/2018 - 03:45

శ్రీకాళహస్తి, జూన్ 1: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఒక ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించాడు. శుక్రవారం ఈఓ భ్రమరాంబ ఆధ్వర్యంలో సిబ్బంది హుండీ కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా లెక్కింపులో పాల్గొన్న స్కిట్ ఇంజనీరింగ్ కాలేజి ల్యాబ్ అసిస్టెంట్ జగదీష్ రూ.6900 కట్టగా కట్టి జేబులో పెట్టుకోవడాన్ని దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఈఓ భ్రమరాంబకు ఫిర్యాదు చేశారు.

06/02/2018 - 02:56

మోపిదేవి, జూన్ 1: ప్రమాదవశాత్తు కృష్ణా నది రేవులో స్నానానికి దిగిన ఇరువురు యువకుల్లో ఒకరు గల్లంతైన సంఘటన మండల పరిధిలోని కె.కొత్తపాలెంలో చోటు చేసుకుంది. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన కుండా నాగబాబు (18), జొన్నలగడ్డ నాగసాయి (18) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం గ్రామంలో జరుగుతున్న శ్రీ అంకమ్మ తల్లి సంబరానికి వచ్చారు.

06/02/2018 - 02:44

జీడిమెట్ల, జూన్ 1: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చింతల్, గణేశ్‌నగర్‌లో నివాసముండే కృష్ణమూర్తి, లత దంపతుల కొడుకు సాయిచరణ్(24), ఓ కూతురు సంతానం. కృష్ణమూర్తి మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. సాయిచరణ్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. శుక్రవారం సాయంత్రం సాయిచరణ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Pages