S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/01/2018 - 23:38

చిత్తూరు, జూన్ 1: జంట హత్య కేసులో ప్రధాన నిందితుడైన సీజింగ్ రాజాను శుక్రవారం చిత్తూరు పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. గత నెలలో తమిళనాడుకు చెందిన ఆశోక్ కుమార్, గోపిలను దారుణంగా హత్య చేసి, మృతదేహాలను తమిళనాడు సరిహద్దు అయిన గుడిపాల మండలం పానాటూరు వద్ద పడవేసిన సంగతి తెలిసిందే. ఈకేసును సీరియస్‌గా తీసుకొన్ని చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి ఆర్థిక లావాదేవీలే ఈ హత్యలకు కారణమని గుర్తించారు.

06/01/2018 - 23:38

శ్రీకాళహస్తి, జూన్ 1: శ్రీకాళహస్తి మండలం రామాపురం గ్రామం వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. సుమారు 25 సంవత్సరాల వయస్సును యువకుడిని కాల్చి చంపినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. మృతుడు ఏ ప్రాంతం వ్యక్తి, ఎందుకు కాల్చి చంపారనే విషయాన్ని విచారిస్తున్నారు. సంఘటన జరిగి రెండు రోజులై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

06/01/2018 - 02:47

కడప, మే 31: ఇళ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను హత్యచేసి వారి వద్ద బంగారు నగలు దోచుకున్న ముగ్గురు సభ్యుల హంతక ముఠాను కడప జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 2013లో ఈ ముఠా కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుసుగా ముగ్గురు మహిళలను హత్యచేసి నగలు దోచుకుంది. ముఠాసభ్యుల్లో అబ్దుల్ కలాం, షేక్ మహ్మద్ ఇషాక్, గౌస్ లాజమ్ ఉన్నారు.

06/01/2018 - 02:02

హైదరాబాద్, మే 31: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ గుంజా సామ్యూల్ ఏసుభక్త జోషువా అలియాస్ సామ్యూల్‌ను నగర సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/01/2018 - 01:57

న్యూఢిల్లీ, మే 31: కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో విచారణకు గైర్హాజరయ్యారు. గురువారం ఆయన సీబీఐ కోర్టుకు హాజరు కావల్సి ఉంది. చిదంబరం ను ప్రశ్నించాల్సి ఉండగా కోర్టుకు రాలేదు. అయితే చిదంబరం గైర్హాజరుకు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతికి సంబంధించి మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

06/01/2018 - 01:54

న్యూ ఢిల్లీ, మే 31: దేశ భద్రతకు సైబర్ దాడులు పెనుసవాళ్లువిసురుతున్నాయని, కీలకమైన ఆర్థిక సంస్థలు, వ్యవస్థలకు ముప్పుగా పరిణమించాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు. దేశీయ భద్రతపై గురువారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, భద్రతా ఏజన్సీలు సైబర్ దాడులకు దీటుగా బదులిచ్చేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని కోరారు.

06/01/2018 - 01:37

న్యూఢిల్లీ, మే 31: ‘దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదు’ అని అంటుంటారు. అలాంటిదే ఒకటి వెలుగుచూసింది. ఓ నిందితుడికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా, కింది కోర్టు అతడిని విడుదల చేయలేదు. గురువారం ఈ అంశం సుప్రీం కోర్టు విచారణకు వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం మెజిస్టీరియల్ కోర్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

06/01/2018 - 01:24

ఏలూరు, మే 31: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాన్న ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ గ్రేడ్-2 అధికారి దొడ్డిగర్ల ముక్తేశ్వరరావు ఇల్లు, బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో సుమారు కోటిన్నర విలువైన ఆస్తులు గుర్తించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ భారీగానే ఉంటుందని సమాచారం.

06/01/2018 - 01:19

నెల్లూరు, మే 31: ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తూ కొన్ని సందర్భాల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను నెల్లూరు జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.30 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

06/01/2018 - 00:57

సంతమాగులూరు మే 31: ఒక వైపు ఉరుములు మెరుపులు వడగండ్ల వాన, మరోవైపు ఈదురుగాలులు, గొర్రెల కాపురుపై పిడుగుపాటు ఒకరి మృతి, ఇరువురికి గాయాలు ఇదీ సంతమాగులూరు మండలంలో గురువారం సాయంత్రం 4నుండి 5గంటల మధ్య జరిగిన భీభత్సం. ఈ అనూహ్య సంఘటనలో గురిజేపల్లి గ్రామ పరిసరాల్లో గొర్రెల కాపరులపై పిడుగు పడి గొర్రెల కాపరి అనంత పెదబాబు(28) మృతి చెందగా దారం కోటేశ్వరరావు, లక్ష్మయ్య, చిన్నం పూర్ణయ్యలకు తీవ్రగాయాలయ్యాయి.

Pages