S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/31/2018 - 23:45

అచ్చంపేట, మే 31: మండలంలో పనిచేస్తున్న ముగ్గురు ఫీల్డ్ అసిప్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీఆర్‌డీఏ పీడీ సుధాకర్ నుండి బుధవారం ఉత్తర్వులు అందినట్లు ఏపీఓ లక్ష్మయ్య తెలిపారు.

05/31/2018 - 23:00

గుంతకల్లు, మే 31 : టిప్పర్ లారీ ఢీకొనడంతో గురువారం పట్టణానికి చెందిన వన్నూర్‌స్వామి(30) మృతి చెందినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. వన్నూర్‌స్వామి స్థానిక హనుమేష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన తల్లి బస్టాండ్ సమీపంలో పండ్ల వ్యాపారం చేసి కుమారుడితో కలసి జీవనం సాగిస్తుంది. అయితే తల్లి వద్దకు వచ్చిన వన్నూర్‌స్వామి బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని టిప్పర్ ఢీకొంది.

05/30/2018 - 04:11

సిరిసిల్ల, మే 29: నాటు తుపాకులు, నాటు బాంబులు తదితర ఆయుధాలు కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులను సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ మసీదు వద్ద ఆయుధాలతో సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో వెళ్ళగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.

05/30/2018 - 03:26

హైదరాబాద్, మే 29: బస్సును లారీ ఢీ కొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైన కామర్స్ కాంట్రాక్టు లెక్చరర్ జి హరిప్రసాద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని, ఇంటర్మీడియట్ బోర్డు మరో ఐదు లక్షల రూపాయిల పరిహారాన్ని ప్రకటించింది.

05/30/2018 - 03:10

న్యూఢిల్లీ, మే 29: మధ్యప్రదేశ్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి ముద్దాయికి హైకోర్టు విధించిన మరణశిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈమేరకు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, మోహన్ ఎం శాంతన్‌గౌడర్‌తో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది. గత ఏడాది బాలికపై అత్యాచారం చేసి హత్యచేశారు. రేపిస్ట్ సతీష్‌కు కింది కోర్టు మరణశిక్ష విధించగా హైకోర్టు ధృవీకరించింది.

05/30/2018 - 02:02

షాద్‌నగర్ రూరల్, మే 29: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఉదయం షాద్‌నగర్ పట్టణ సమీపంలోని జీఎంఆర్ టోల్‌ఫ్లాజా వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పరమేశ్ (32), సురేష్ (30) అనే ఇద్దరు యువకులను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

05/30/2018 - 01:05

న్యూఢిల్లీ, మే 29: భారతీయ ఎయిర్ ఆసియా వెంచర్‌కు అంతర్జాతీయ లైసెన్సులు పొందేందుకు అక్రమమార్గాల్లో ప్రయత్నించారనే అభియోగంపై ఎయిర్ ఆసియా గ్రూప్ సిఇవో టోనీ ఫెర్నాండెజ్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. మలేసియా ఎయిర్ ఎసియా బెర్హాడ్ సంస్థ మాజీ డిప్యూటీ సిఇవో తరమలింగం కనగలింగం, ఎయిర్ ఆసియా డైరెక్టర్ ఆర్ వెంకట్‌రామన్‌తో పాటుయిర్సియా, ఎయిర్ ఆసియా బెర్హాడ్ కంపెనీలపై సిబిఐ కేసులు నమోదు చేసింది.

05/30/2018 - 02:29

ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో మంగళవారం రైలుకింద పడి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను కాలప్ప(25), గాది లింగమ్మ(23), ఆమె కుమారుడు హర్షవర్ధన్(7)గా గుర్తించారు. కాలప్ప, లింగమ్మ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. మృతుల బంధువులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

05/29/2018 - 04:25

ఆదిలాబాద్ టౌన్, మే 28: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన మెస్రం కిషన్ (50) అనే గిరిజనుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందిన సంఘటన అలజడి రేపింది. కిషన్ తన మోటార్ సైకిల్‌పై కేఆర్‌కే కాలనీ నుంచి పట్టణానికి ఆదివారం సాయంత్రం వస్తుండగా ఎస్పీ క్యాం పు కార్యాలయంకు వెళ్లే దారిలో ఎదురుగా వస్తున్న పోలీసు జీపును ఢీకొనడంతో తీవ్రరక్తస్రావంతో అక్కడికక్క డే మృతిచెందాడు.

05/29/2018 - 04:32

స్టేషన్‌ఘన్‌పూర్: ఆలయ సిబ్బంది వద్ద రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆలయ కార్యనిర్వహణాధికారి చెరుకు జయశంకర్ అడ్డంగా దొరికిన సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీబుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం..

Pages