S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/27/2018 - 00:13

చెనే్నకొత్తపల్లి, మే 26 : అతివేగం కారణంగా ఓ ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని నాగసముద్రం గేట్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. రామగిరి సీఐ యుగంధర్ తెలిపిన వివరాలిలా వున్నాయి. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో 37 మంది ప్రయాణీకులతో బెంగళూరుకు వెళుతోంది.

05/27/2018 - 00:12

హిందూపురం, మే 26 : పతంజలి కంపెనీ ప్రతినిధులం అని చెప్పుకుని స్థానిక ఓ బియ్యం వ్యాపారిని బురిడీ కొట్టించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

05/26/2018 - 02:28

న్యూఢిల్లీ, మార్చి 25: ‘ఈ కేసు చారిత్రక నష్టం. భారత జాతికే అవమానం’ అంటూ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఢిల్లీ హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) వ్యాఖ్యానించింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకె ఎంపీ కనిమొళి తదితరులు అభియోగాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

05/26/2018 - 02:21

విజయవాడ, మే 25: బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు, 3 లక్షల రూపాయల నకిలీ నోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

05/26/2018 - 02:19

నెల్లూరు, మే 25: నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో శుక్రవారం ఉదయం విజయవాడ డి ఆర్ ఐ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. మొత్తం 5.7కేజీల బరువుకలిగిన వివిధ పరిమాణాల్లో ఉన్న 58 బంగారు బిస్కట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ సుమారు రూ.1.80కోట్లు ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు.

05/26/2018 - 01:46

ఆమనగల్లు, మే 25: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద చెక్కు డబ్బులను తీసుకునేందుకు వచ్చిన తల్లీతనయుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లవారిపల్లి గ్రామానికి చెందిన రుద్రక్ష మల్లమ్మ(65), రుద్రక్ష నర్సింహా(46)కు ఇటీవల రైతుబంధు పథకం క్రింద చెక్కులు అందుకున్నారు.

05/26/2018 - 01:45

గచ్చిబౌలి, మే 25: పగటి ఉష్ణోగ్రతలు పెరడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న కార్లలో మంటలు వ్యాపిస్తున్న సంఘటనలు రోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న ఓలా క్యాబ్‌లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈసంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని గచ్చిబౌలిలో జరిగింది.

05/26/2018 - 01:44

దిల్‌సుఖ్‌నగర్, మే 25: ప్రభుత్వం పోలీసులకు అన్ని రకాల వసతులు కల్పించినా వారిలో మార్పు మాత్రం రావడంలేదు. ప్రెండ్లీ పోలీస్ అంటూనే మరోపక్క అరాచకాలను కొనసాగిస్తున్నారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ ఈరోజీ ఒక నిందితుడికి త్వరగా చార్జిషీట్ వేసేలా చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు.

05/26/2018 - 01:20

మక్తల్, మే 25: విద్యుత్ షాక్‌తో మృతిచెందిన ఓ రైతు సంఘటన మండల పరిధిలోని అంకెన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ చారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అంకెన్‌పల్లి గ్రామానికి చెందిన అంజన్న (42) అనే రైతు శుక్రవారం గడ్డంపల్లి గ్రామ శివారులోని తన పొలానికి వెళ్లి నీటి బోరు స్టార్టర్ బటన్‌ను నొక్కాడు. కాగా, స్టార్టర్‌లో తేలిన విద్యుత్ వైర్లను గమనించని రైతుకు షాక్ కొట్టింది.

05/26/2018 - 01:16

ఇందూర్, మే 25: ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువులో దూకి ఓ బీటెక్ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్‌హనుమాన్ ప్రాంతానికి చెందిన పీ.సౌమిత్(19) బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన సౌమిత్ అలీసాగర్‌కు చేరుకుని, చెరువులో దూకి నీట మునిగి ఊపిరాడక మృతి చెందాడు.

Pages