S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/16/2018 - 04:08

మాచవరం, మే 15: మతిస్థిమితం లేని మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. మోర్జంపాడు గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటుంది. ఇది గమనించిన గ్రామానికి చెందిన 60ఏళ్ళ తుమ్మా వీరయ్య బాలికపై కన్ను వేశాడు. ఇంటి వద్దనే ఉన్న చిన్నారికి మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు.

05/16/2018 - 03:58

చేర్యాల, మే 15: డబ్బులు, బంగారం ఇవ్వలేదంటూ తల్లిని తనయుడు చంపిన సంఘటన చేర్యాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం చేర్యాల సీఐ రఘు విలేకరులతో సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం... కొమురవెళ్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన బండారి గౌరమ్మ(75)ను ఆమె పెద్దకొడుకు కొండయ్య మధ్యం మత్తులో చంపినట్లు తెలిపారు. జనవరి 22 రాత్రి మధ్యం తాగి ఇంటికి వచ్చిన కొండయ్య తల్లి గౌరమ్మను బంగారం, డబ్బులు అడగగా..

05/16/2018 - 03:44

న్యూఢిల్లీ, మే 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2013 సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై ఆరోపణలు ఎదుర్కొని జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న భారత పేసర్ ఎస్. శ్రీశాంత్ అభ్యర్థనపై అతనిని విడుదల చేసే విషయమై జూలై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది.

05/16/2018 - 03:25

సనత్‌నగర్, మే 15: నాలాలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డిగూడ నాలాలోని నాలాలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర దుర్గంధంలో ఉన్న మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీసి ప్రాథమిక విచారణ జరిపారు.

05/16/2018 - 03:22

గచ్చిబౌలి, మే 15: జాగ్రత్తగా భద్రపరచవలసిన బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల డబ్బు పరుల పాలవుతోంది. ఆర్థిక నేరస్థుల నుంచి సైబర్ నేరగాళ్ల వరకు అందరూ ప్రజల సొమ్ముపై కన్ను వేయడంతో బ్యాంకులో డబ్బు దాచుకోవాలంటే ఖాతాదారులు భయపడుతున్నారు.

05/16/2018 - 01:51

న్యూఢిల్లీ, మే 15: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) విచారణకు స్వీకరించింది. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లు దాఖలు చేశారు.

05/16/2018 - 01:51

కోచి, మే 15: సిమీ నాయకుడు సఫ్దర్ నరోగీతో సహా 18 మంది సిమీ సభ్యులకు ఇక్కడి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలో తమ సంస్థ సభ్యులకు అక్రమంగా ఆయుధాల వినియోగంపై వీరు శిక్షణ ఇస్తున్నట్టు 2007లో కనుగొన్నారు. న్యాయమూర్తి ఎడప్పగథ్, నేరస్తులకు యుఏపీఏ, ఈఎస్‌ఏ, ఐపీసీ సెక్షన్ల కింద ఈ శిక్షలను ఖరారు చేశారు.

05/16/2018 - 01:50

న్యూఢిల్లీ, మే 15: మాజీ క్రికెటర్, మంత్రి నవ్‌జోత్‌సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చే తీర్పును ఇచ్చింది. 1988నాటి కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన ధర్మాసనం సిద్ధూను నిర్దోషిగా విడుదల చేసింది. హత్యానేరం కిందికిరాని, శిక్షించదగ్గనేరంగా పరిగణించలేమని కోర్టు ప్రకటించింది. భారత శిక్షాస్మృతిలోని 304, 323 సెక్షన్ల కింద కేసు నుంచి విముక్తి కల్పింస్తున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది.

05/15/2018 - 22:21

కొండాపురం, మే 15: కొండాపురం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. యర్రగుంట్ల జీఆర్పీయఫ్ ఎస్సై వై.శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌నాయుడు కుమారుడు రావి మహతేజ్ (22) బిటెక్ పూర్తిచేశాడు.

05/15/2018 - 22:02

వినుకొండ, మే 15: స్థానిక విష్ణుకుండినగర్‌లో నివసిస్తున్న వివాహిత తోట రమాదేవి (45) సోమవారం రా త్రి భర్త తోట వెంకట సాంబశివరావు చేతిలో హత్యకు గురైంది. ఏలూరుకు చెందిన ఈ దంపతులు ఇటీవల వినుకొండకు వచ్చి ఎంపీ రాయపాటి పోలాల్లో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నా డు. ఇటీవల అనారోగ్యంతో అతన్ని ఉద్యోగం నుండి తొలిగించారు. దీం తో ఆర్థిక ఇబ్బందులు, కు టుంబ కలహాలు జరుగుతున్నాయి.

Pages