S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/15/2018 - 00:59

చిన్నకోడూరు, మే 14 : మా భూములు మాకు కావాలంటు దీక్షలకు దిగిన రైతులపై ఏస్‌ఐ దురుసుగా ప్రవర్తించి టెంటు పీకేసిన సంఘటన మండల పరిధిలోని ఎల్లాయపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని భూములను ఇటివలే అనంతగిరి ప్రాజెక్టులో పోతున్నాయని రైతులనుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అనంతగిరి ప్రాజెక్టు కట్టను జరిపి కట్టడంతో ఎల్లాయపల్లికి చెందిన రైతుల భూములు పోవడం లేదు.

05/14/2018 - 22:30

దువ్వూరు, మే 14: మండల కేంద్రమైన దువ్వూరులోని క్రిష్టియన్ కాలనీలోని నలుగురు జూదం ఆడుతుండగా వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. సోమవారం క్రిష్టియన్ కాలనీ సమీపంలో కంపచెట్లులో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో కోగటం మత్తయ్య, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద వున్న రూ.2250లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

05/14/2018 - 22:16

* రూ.95,700ల నగదు స్వాధీనం

05/07/2018 - 04:19

యువకుడి మృతి

05/02/2018 - 04:11

గచ్చిబౌలి, మే 1: ఫేస్‌బుక్, వాట్స్‌ప్, టెలిగ్రామ్‌లో మీ ఫొటోలకు గానీ.. మీ వివరాలకు భద్రత లేదు. రుణం కోసం బ్యాంకులో ఇచ్చిన పత్రాలకు భరోసా లేదు. వివరాలతో మీకు తెలియకుండా క్రెడిట్ కార్డులు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తున్న నాలుగు ముఠాలలోని 16 మందిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

05/02/2018 - 04:08

శంకరపట్నం, మే 1: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో భార్యపై అనుమానంతో ఓ భర్త గొడ్డలితో భార్యను నరికి చంపిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం..కేశవపట్నంకు చెందిన దుర్గం తిరుపతి, ధనలక్ష్మి అనే దంపతులకు కుమారుడు గణేష్, కూతురు నిహారికలు ఉన్నారు.

05/02/2018 - 03:54

మంచిర్యాల, మే 1: మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల సోమవారం రాత్రి హాజీపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి అభిష్పా వర ప్రదాయిని ( 35) సోమవారం రాత్రి మృతి చెందిందని బంధువులు, తోటి సహాద్యోగులు ఆరోపించారు.

05/02/2018 - 03:51

కౌటాల, మే 1: చింతలమానేపల్లిపోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ అన్కోండ గ్రామానికి చెందిన వివాహిత ధన్నూరి సోనుబాయి (19) అదృశ్యం అయిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.

05/02/2018 - 03:29

ఆత్మకూరు, మే 1: మండల పరిధిలోని తిప్డంపల్లి శివారులో మంగళవారం సాయంత్రం వరికోత మిషన్ కింద పడి ఇద్దరు మృతిచెందారు. ఆత్మకూరు ఏఎస్‌ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తిప్డంపల్లి గ్రామానికి చెందిన వడ్డెరాములు వరిపొలంలో కోత మిషన్ ద్వారా వరిపైరు కోస్తోంది.

05/02/2018 - 02:59

నిజామాబాద్, మే 1: అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు రుచిమరిగిన ఇసుక మాఫియా బరితెగిస్తోంది. తమ అక్రమ దందాకు అడ్డుగా నిలుస్తున్న అధికారులపై భౌతిక దాడులకు సైతం వెనుకాడడం లేదు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని శివారులో మంజీరా నది సాక్షిగా మంగళవారం చోటుచేసుకున్న సంఘటన ఇసుక స్మగ్లర్ల బరితెగింపు ధోరణికి అద్దం పట్టింది.

Pages