S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/23/2018 - 00:06

కొవ్వూరు, ఏప్రిల్ 22: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గృహిణి ఆమె ఇద్దరు పిల్లలతో ఆదివారం కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని గోదావరిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బళ్ల సుధారాణి (28), ఆమెకు ఒక కుమార్తె నిహారిక (5), ఈశ్వరి మణికంఠ (4)తో కలిసి గోదావరిలో దిగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సుధారాణి మావయ్య సత్యనారాయణ తెలిపారు.

04/23/2018 - 00:02

కొవ్వూరు, ఏప్రిల్ 22: కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో శనివారం రాత్రి గోదావరి నదిలో స్నానానికై దిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు ఆదివారం గోదావరి నదిలో లభ్యమైనట్టు పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతిచెందిన యువకులు గౌరీపట్నానికి చెందిన సిహెచ్ సురేష్ (18), సిహెచ్ వెంకటేష్ (22)లుగా గుర్తించినట్టు తెలిపారు.

04/22/2018 - 23:52

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22: గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన మహిళ హత్య కేసును శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఛేదించారు. భర్తే హంతకుడుని నిర్ధారించి అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటకిషోర్ ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఓబుల్ రెడ్డికి, కేవీబీపురం మండలం మారప్పరెడ్డి కండ్రిగకు చెందిన మల్లీశ్వరికి 20 సంవత్సరాల క్రితం వివాహమైంది.

04/22/2018 - 22:30

గోరంట్ల, ఏప్రిల్ 22 : మండల పరిధిలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో చిత్రావతి నదిలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శవం కుళ్లిపోయి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించారన్నా రు. శవం తరలించే స్థితిలో లేకపోవడంతో హిందూపురం నుంచి వైద్యులను పి లిపించి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

04/22/2018 - 05:00

జి.కొండూరు, ఏప్రిల్ 21: టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం - చత్తీస్‌ఘడ్ 30వ నెంబరు జాతీయ రహదారిపై కుంటముక్కల క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం రాత్రి టిప్పర్, బైక్‌ను ఢీకొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

04/22/2018 - 04:27

గుర్రంపోడు, ఏప్రిల్ 21: మండలంలోని పోచంపల్లి గ్రామంలో కల్తీ కల్లు ఘటనలో హైద్రాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

04/22/2018 - 04:09

హైదరాబాద్, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) బాలయ్ శ్రీనివాస్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. నిందిత అధికారి సుమారు రూ.2.66 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు తాజా తనిఖీల్లో డాక్యుమెంట్లతో సహా ఆధారాలు దొరికాయని ఏసీబీ డీజీ తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

04/22/2018 - 03:59

హైదరాబాద్, ఏప్రిల్ 21: మద్యం తాగి వాహనాలు నడిపిన 95 మందికి నాంపల్లి 3, 4వ మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. మరో 41 మంది డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసింది. నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

04/22/2018 - 03:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఢిల్లీ శివారులోని ఓ పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడి తండ్రి, బంధువులు ప్రయాణిస్తున్న టాటా సుమో వాహనం గుంతలో పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. పెళ్లి కుమారుడి తండ్రి సహా ఆరుగురు మృతిచెందారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు. మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే...

04/22/2018 - 03:43

హైదరాబాద్, ఏప్రిల్ 21: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై ఎస్సీ ఎస్టీ అత్యాచార, దౌర్జన్యాల నిరోధక చట్టం కింద హైదరాబాద్ గాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటస్వామి ఫిర్యాదు చేశారు.

Pages