S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/14/2018 - 01:47

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు లాప్‌టాప్‌లు, 26 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని యాక్సిస్, కెనరాబ్యాంక్, బరోడా, ఐసీఐసీఐ బ్యాంకుల అక్కౌంట్లను సీజ్ చేశారు. కేసుకు సంబంధించి నగర సీసీఎస్ డీసీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

04/14/2018 - 01:40

సిరిసిల్ల, ఏప్రిల్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ చేతిలోని ఎస్‌ఎల్‌ఆర్ తుపాకి మిస్ ఫైర్ జరిగి గాయాలకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి తంగళ్ళపల్ల మండలం తాడూరులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ ఘటనలో మిస్ ఫైర్ జరిగి గాయాల పాలైన సత్యనారాయణను సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

04/14/2018 - 01:35

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 13: ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలోని రైతు యాసరవేణి పర్శరాములు(50) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. వారి కథనం మేరకు గ్రామంలోని పర్శరాములు ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎనిమిదేళ్ల కిందట గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అక్కడ సరైన పనులు లభించక ఇంటి ముఖం పట్టాడు. తనకున్న 2.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.

04/14/2018 - 01:29

దేవరకద్ర, ఏప్రిల్ 13: మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో 14రోజుల క్రితం అన్నదమ్ముళ్ల మధ్య గొర్రెల కోసం జరిగిన వివాదంలో అన్న దశరథ్(27)ను తమ్ముడు రవి హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గత 14రోజుల క్రితం గ్రామ సమీపంలో గొర్రెలను మేపేందుకు వెళ్లగా అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో అన్న దశరథ్‌ను తమ్ముడు రవి చంపినట్లు పోలీసులు తెలిపారు.

04/14/2018 - 01:00

చింతపల్లి, ఏప్రిల్ 13: సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన సంఘటన మండలంలోని కురంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కురంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర బొజ్జమ్మకు 13 ఎకరాల భూమి ఉంది. భర్త చనిపోవడంతో అన్నీ తానై వ్యవసాయ పనులు, కుటుంబ నిర్వహణ పనులన్నీ చూసుకుంటూ పెద్ద కుమారుడు ఎర్ర రాజశేఖర్ (25)తో చర్చిస్తూ ఉండేది. గత కొంత కాలంగా చిన్న కుమారుడు వెంకటయ్య ఆస్తి పంచాలని తగాదా పడుతున్నాడు.

04/14/2018 - 00:58

ఆదోని, ఏప్రిల్ 13 : ఆదోనిలో దొంగనోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.లక్ష 72వేల దొంగనోట్లును, రెండు సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకోని నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

04/14/2018 - 00:57

దేవనకొండ, ఏప్రిల్ 13: మార్కులు తక్కువగా వచ్చాయని ఇంటర్ మీడియట్ విద్యార్థి రాజశేఖర్‌రెడ్డి (17) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ గంగయ్యయాదవ్ తెలిపారు. శుక్రవారం పోలీసుల తెలిపిన కథనం మేరకు దేవనకొండకు చెందిన రాజశేఖర్‌రెడ్డి తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ పరీక్షలు రాశాడు.

04/14/2018 - 00:51

ఖమ్మం(క్రైం), ఏప్రిల్ 13: విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం టాస్క్ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో సుమారు 1.10కోట్ల రూపాయల విలువైన 11క్వింటాళ్ల గంజాయితోసహా రెండు లారీలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు.

04/14/2018 - 00:35

కోవూరు, ఏప్రిల్ 13: మహిళలపై అత్యాచారాలు, దాడులు చేస్తూ జనాల కంటి మీద కునుకు లేకుండా చేసిన సైకోను ఎట్టకేలకు కోవూరు పోలీసులు గురువారం సాయంత్రం కోవూరు నాగులకట్టలోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం కోవూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రూరల్ డీ ఎస్పీ వెంకట రాఘవరెడ్డి సైకో సూరిబాబు (42)ను అరెస్ట్ చూపారు.

04/14/2018 - 00:33

నెల్లూరు, ఏప్రిల్ 13 : నగరంలో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌చేసి, అతని వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీసీఎస్ డీఎస్పీ బాలసుందరరావు తన కార్యాయలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.

Pages