S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/13/2018 - 01:47

చందుర్తి, ఏప్రిల్ 12: రుద్రంగి మండలం మానాల గ్రామంలో వీరునితండాలో గత నాలుగు రోజుల క్రితం 27 సంవత్సరాల వివాహితపై అత్యాచారం చేసిన బానోతు మదన్, కున్సోత్ లక్‌పతిలను గురువారం రాత్రి సిఐ విజయ్ కుమార్ అరెస్ట్ చేశారు. వివరాలను ఆయన వెల్లడించారు. ఇంటిలో ఎవరు లేని సమయంలో వివాహిత నోట్లో గుడ్డలు కుక్కి సమీప అటవీప్రాంతానికి తీసుకవెళ్లి అత్యాచారం చేసినట్లు సిఐ తెలిపారు.

04/13/2018 - 00:55

నిజామాబాద్, ఏప్రిల్ 12: జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ క్యా ంపు కార్యాలయానికి కూతవేటు దూ రంలో భారీ చోరీ జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎల్లవేళలా పో లీసు పహారాతో పటిష్టమైన భద్రత కలిగిఉండే ప్రాంతంలోని ఓ వస్త్ర షో రూమ్‌లో ఆగంతకుడు ఎంతో చాకచక్యంగా చొరబడి సుమారు మూడు ల క్షల రూపాయల వరకు సొత్తును దో చుకుని ఉడాయించాడు.

04/13/2018 - 00:25

పెద్దపంజాణి, ఏప్రిల్ 12: ఆర్టీసీ మెట్రోబస్సు, కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన గురువారం చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలం మదనపల్లె-చిత్తూరు జాతీయరహదారి బట్టందొడ్డి-గద్దూరు మలుపువద్ద చోటుచేసుకుంది. పెద్దపంజాణి ఎస్‌ఐ చంద్రమోహన్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి...

04/13/2018 - 00:16

గోకవరం, ఏప్రిల్ 12: దళిత గిరిజన మైనర్ బాలికను వేదింపులకు గురిచేసిన యువకుడిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. గోకవరం ఎస్సై జి ఉమమహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..రంపచోడవరం మండలం కె యర్రంపాలెం గ్రామానికి చెందిన గిరిజన మైనర్ బాలిక రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

04/13/2018 - 00:05

పెనుబల్లి, ఏప్రిల్ 12: మండలపరిధిలోని టేకులపల్లి సమీపంలో గల సాగర్ కాల్వలో ప్రమాదవశత్తు పడి కల్లూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన గురువారం వెలుగు చూసింది. ఈ సంఘటనలో కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి అంజనీ సాయికృష్ణ (20), రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఐతరాజు సాయితేజ (20) మృతి చెందారు.

04/13/2018 - 00:00

గూడూరు టౌన్, ఏప్రిల్ 12: వెలుగొండ అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం దుంగలను నరికి చెన్నైకు తరలించి అక్కడ నుండి బర్మా, చైనా దేశాలకు ఎగుమతి చేసే ఏడుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు 80 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, వాహనాలను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు గురువారం గూడూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో జిల్లా టాస్క్ఫోర్స్ ఓఎస్‌డి విఠలేశ్వరరెడ్డి వివరాలను స్థానిక విలేఖర్లకు వెల్లడించారు.

04/12/2018 - 23:57

ఒంగోలు,ఏప్రిల్ 12:ఒంగోలులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మంగమూరురోడ్డులోని కొత్తడొంకలో పిల్లలు ఆడుకుంటుండగా గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం 12.30గంటలనుండి ఒంటిగంట ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన హృదయవిదారకంగా మారింది. మృతిచెందిన వారిలో గుడిమిట్ల నవదీప్(7), సిందే ప్రేమ్‌చంద్ (7), కట్టా మణికంఠ (7)లుగా గుర్తించారు.

04/12/2018 - 23:35

నిడదవోలు, ఏప్రిల్ 12: జిల్లాలోని కొవ్వూరు, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ల పరిధిలో అనేక గ్రామాల రైతులకు గత మూడు సంవత్సరాలుగా కంటిమీద కునుకులేకుండా చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను ఎట్టకేలకు నిడదవోలు పోలీసులు అరెస్టుచేశారు.

04/11/2018 - 04:06

గోపాలపట్నం, ఏప్రిల్ 10: ఇక్కడి అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మంగళవారం మార్కెటింగ్ శాఖ కమిటీ డీడీ కం సెక్రటరీ ఎస్‌టి నాయుడు ఒక వ్యాపారి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కంచరపాలెంలో జీడిపప్పు వ్యాపారి ఎస్‌ఎస్‌విఎస్ షాపు యజమాని జగన్నాథరావు పలాస నుంచి జీడిపప్పు తెచ్చుకుని విజయవాడ, గుంటూరు అలాగే రాష్ట్రంలోని పెద్ద పెద్ద దేవాలయాలకు సరఫరా చేస్తుంటాడు.

04/11/2018 - 03:40

హైదరాబాద్, ఏప్రిల్ 10: చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెంబరు 574 నల్లదానయ్య(33).. 2014 అక్టోబర్ 20న సికింద్రాబాద్‌లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏప్రిల్ 30న సోమవారం ఉదయం 11 గంటలకు దానయ్య మరణంపై విచారణ జరుగుతుందని కందుకూరు రాజస్వ మండలాధికారి (రెవెన్యూ డివిజనల్ అధికారి) సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ సీహెచ్ రవీందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Pages