S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/11/2018 - 03:31

ఖైరతాబాద్, ఏప్రిల్ 10: మాజీ ఐఏఎస్ అధికారిపై సుపారి గ్యాంగ్ చేసిన దాడిని పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. 5న ప్రశాసన్‌నగర్‌లో ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. క్రికెట్ స్టంప్‌తో యాదాచారి తలపై కొట్టడంతో కుప్పకూలి పోయాడు.

04/11/2018 - 02:56

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఆస్తి తగాదాల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి దయాచారిని హత్య చేసేందుకు యత్నించిన ఐదుగురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. దయాచారి కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తులు గుంటూరు, పటాన్‌చెరువుల్లో ఉన్నాయి. వీటి విషయమై ఆయన సోదరుని పిల్లలైన మంజుల, కరుణాకర్‌లతో వివాదం నడుస్తోంది.

04/11/2018 - 02:22

గూడూరు టౌన్, ఏప్రిల్ 10: చిట్టమూరు మండలంలోని మొలకలపూడి - చిల్లమూరు మార్గమధ్యంలో ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతమైన గుమ్మిడిగుంట, అలత్తురు గ్రామాలకు చెందినవారు మంచినీటి బోర్లు వేసే స్టాటర్ రాళ్లను ఆయా గ్రామాలకు తీసుకొస్తుంటారు.

04/11/2018 - 02:06

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 10: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నగరంలో హల్‌చల్ చేస్తున్న డేరింగ్ అండ్ డేషింగ్ (డీడీ) గ్యాంగ్‌కు నగర పోలీసులు బ్రేక్ వేశారు. ఈ ముఠాపై ఇప్పటికే వివిధచోట్ల పలు కేసులు నమోదయ్యాయి. తమ వికృత చేష్టలతో నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అలజడి సృష్టిస్తున్న ఈ ముఠాలో సభ్యులు పాత నేరస్తులే కావడం గమనార్హం.

04/11/2018 - 01:58

హైదరాబాద్, ఏప్రిల్ 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, తెలుగు దేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మంత్రివర్గంలో చేరిన విషయంలో దాఖలైన పిటిషన్‌పై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు మంగళవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది.

04/11/2018 - 01:30

లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 10: కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళుతున్న టాటా ఇండికా కారులో అకస్మాత్తుగా మంటల చెలరేగి కారు దగ్ధమైన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని మొర్రేడు బ్రిడ్జిపైన మంగళవారం జరిగింది. ట్రాఫిక్ ఎస్సై అంజయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

04/11/2018 - 00:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: సినిమాల విడుదలకు సంబంధించిన కేంద్ర సెన్సార్ బోర్డు నిర్ణయమే అంతిమమని, ఒక్కసారి బోర్డు క్లియరెన్స్ లభించిన తర్వాత ఏ చిత్ర ప్రదర్శనను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ ఉండదని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తెలిపింది. దీంతో నానక్ షా పకీర్ చిత్రాన్ని ఏప్రిల్ 13న దేశవ్యాప్తంగా విడుదలకు మార్గం సుగమమైంది.

04/11/2018 - 00:08

నల్లగొండ రూరల్, ఏప్రిల్ 10: ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ మసాలాలను అక్రమంగా తరలిస్తూ అమ్ముతున్న అంతర్ రాష్ట్ర నేరస్తుల ముఠాను మంగళవారం మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రంగనాథ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

04/10/2018 - 22:55

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 10: జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మాపూర్ రాములు అప్పుల బాధ భరించలేక క్రిమీసంహరక మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. రాములు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు.

04/10/2018 - 22:49

కొత్తకోట, ఏప్రిల్ 10: అక్రమ సంబంధం నేపథ్యంలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కేసును పోలీసులు 17 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు వంశీకృష్ణ నాయక్ బాలుడ్ని తీసుకుని పూణె పారిపోగా పోలీసులు చాకచక్యంగా బాలుడ్ని రక్షించి తీసుకొచ్చారు. కేసును పోలీసులు చేధించిన వివరాలను మంగళవారం కొత్తకోట సీఐ కార్యాలయంలో ఇన్‌చార్జీ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వివరించారు. నాటవెల్లి ఉరగట్టు తండాకు చెందిన రాజునాయక్ సోదరి నారమ్మ.

Pages