S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/18/2019 - 04:03

కొల్లాపూర్, జనవరి 17: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల అడవులలో జింకను వేటాడినట్లు సమాచారం రావడంతో అటవీశాఖాధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి జంతువుల వేటగాడైన బోయ శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ క్షేత్రాధికారి మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.

01/18/2019 - 03:20

మర్రిపాడు, జనవరి 17: కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం జాతీయ రహదారిపై గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది. గ్రామంలోని ఆదర్శపాఠశాల సమీపంలో గల ముంబై జాతీయ రహదారిపై కట్టెల లోడుతో ట్రాక్టర్ నాయుపల్లి నుండి ఆత్మకూరు వైపుకు వస్తోంది.

01/18/2019 - 02:39

న్యూఢిల్లీ, జనవరి 17: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళలు తమకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ మహిళల తరఫున సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్‌ఎన్ రావు, ఎస్‌కే సిక్రీతోకూడిన బెంచ్ వద్ద పిటిషన్ లిస్టయింది.

01/18/2019 - 02:32

న్యూఢిల్లీ, జనవరి 17: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ ఒకరిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. మొత్తం నలుగురిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు. సాయ్‌లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, భారీ మొత్తంలో నిధులు అన్యాక్రాంతం అవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో సీబీఐతో విచారణ జరిపిస్తున్నారు.

01/18/2019 - 02:06

మచిలీపట్నం, జనవరి 17: సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు సంప్రదాయ ముసుగులో సాగిన కోడి పందాలు, జూదక్రీడలపై పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 914 కేసులు నమోదు చేయటంతో పాటు 1561 మందిని అరెస్టు చేశారు. వీరి నుండి రూ.8లక్షల 32వేల 727లు నగదు, 452 కోడి పుంజులు, 420 కోతి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

01/18/2019 - 02:06

చందర్లపాడు, జనవరి 18: మిరప కోతలకు కూలీలను ఎక్కించుకొని వెల్తున్న ఆటోట్రాలీ పల్టీ కొట్టటంతో కూలీలకు గాయాలు అయిన సంఘటన మండలంలోని కాసరబాద వద్ద గురువారం జరిగింది.

01/18/2019 - 02:05

విజయవాడ (క్రైం), జనవరి 17: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితులను ఎన్‌ఐఏ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అక్కడి పోలీసులు పలువురు నిందితులను గతంలో అరెస్టు చేశారు.

01/18/2019 - 01:46

వనస్థలిపురం, జనవరి 17: డీజిల్, పెట్రోల్‌ను రహస్యంగా దొంగిలించి లక్షల రూపాయలు సంపాదించుకుని తప్పించుకుని తిరుగుతున్న అంతర్ రాష్ట్ర చోరీ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ.90.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ ట్యాంకర్, కారు, మోటర్ సైకిల్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

01/18/2019 - 01:44

గచ్చిబౌలి, జనవరి 17: షార్ట్ సర్క్యూట్‌తో మాదాపూర్‌లోని ఓ యానిమేషన్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఉద్యోగులు ఆ ఫ్లోర్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

01/18/2019 - 01:44

వికారాబాద్, జనవరి 17: గుప్త నిధులను తవ్వి అమ్మేందుకు యత్నించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.

Pages