S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/21/2019 - 06:03

సంగెం, నవంబర్ 20: ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మామునూరు ఫాత్‌ఫాండర్ పాఠశాలకు చెందిన బస్సు ప్రతిరోజు ఉదయం సంగెం నుండి కాట్రపల్లి మీదుగా వెళ్తోంది. కాట్రపల్లి గ్రామానికి చెందిన కర్ర అమరేందర్ జ్యోత్స దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

11/21/2019 - 02:48

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గతంలో సింగిల్‌బెంచ్ న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన రివిజన్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం నాడు విచారణ కొనసాగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

11/21/2019 - 02:48

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో బస్సురూట్లను ప్రైవేటీకరించడంపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో 5100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై హైకోర్టులో ప్రజావాజ్యపిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కొద్ది రోజులుగా వాదనలు కొనసాగుతున్నాయి.

11/21/2019 - 02:47

ముంబయి, నవంబర్ 20: గురుకుల్ గృహా నిర్మాణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి సురేష్ జైన్‌కు ముంబయి హైకోర్టు బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైన్‌కు ఊరట లభించింది. అనారోగ్య కారణంగా కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గురుకుల్ గృహా నిర్మాణంలో జరిగిన రూ.29 కోట్ల అవకతవకల కేసులో జైన్‌కు ఏడేళ్ళ జైలు శిక్ష పడింది.

11/21/2019 - 01:53

పూణే, నవంబర్ 20: హోం వర్క్ చేయలేదన్న కారణంతో టెన్త్ విద్యార్థికి వంద గుంజీళ్ల శిక్ష వేసిన టీచర్, గార్డుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్టల్రో ఈ ఘటన చోటుచేసుకుంది. పూణేలోని మహావీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పదో తరగతి విద్యార్థి హోం వర్క్ చేయడం మరిచిపోయాడు. యథావిధిగా పాఠశాలకు వెళ్లాడు.

11/21/2019 - 01:36

గచ్చిబౌలి, నవంబర్ 20: ఉద్యోగం కోల్పోతనే మనస్తాపానికి గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాయదుర్గం సీఐ రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జగదాంబ కాలనీకి చెందిన పొగాకు హరిణి(24) మాదాపూర్‌లోని గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది.

11/21/2019 - 01:55

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుపై మీ సమాధానం ఏమిటీ? అని సుప్రీం కోర్టు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రశ్నించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బెంచ్ ఈడీకి నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయి దా వేసింది.

11/21/2019 - 00:48

హైదరాబాద్: ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు బుధవారం సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ళపై ఆకస్మికంగా దాడులు చేశారు. దీంతో సినీ పరిశ్రమకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా, సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు, వార్షిక ఆదాయాల లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ దాడుల్లో ఐటీ రిటర్నకు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

11/20/2019 - 23:35

ఔరంగాబాద్, నవంబర్ 20: జీఎస్‌టీ ఓ వ్యాపారి ప్రాణాన్ని మింగేసింది. వాలుజ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ చిన్న మెటల్ పాలిషింగ్ యూనిట్‌ను నడుపుతున్న ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త వస్తు అమ్మకం పన్ను (జీఎస్‌టీ) చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పండర్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న విష్ణు రాంబావు కలవనె (53) మంగళవారం తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

11/20/2019 - 23:33

అహ్మదాబాద్, నవంబర్ 20: స్వామి నిత్యానంద మళ్లీ వివాదంలో ఇరుక్కొన్నారు. స్వామిపై కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఆశ్రమ నిర్వహణ కోసం తన భక్తుల నుంచి విరాళాలు వసూలు చేసేందుకు నలుగురు పిల్లలను అపహరించి వారితో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలపై నిత్యానందపై కేసు నమోదైంది.

Pages