S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/04/2018 - 02:45

సనత్‌నగర్, ఏప్రిల్ 3: నగరంలో మరో కలకలం.. దుండగులు చెలరేగిపోయారు. మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్ పోసి నిప్పంటించి హత్యచేశారు. సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర అలజడి రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన సౌమ్యకు, ఆరేళ్ల క్రితం విశాఖకి చెందిన నాగభూషణంతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

04/04/2018 - 02:29

హైదరాబాద్, ఏప్రిల్ 3: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒక వేళ కౌంటర్ దాఖలు చేయని పక్షంలో, కౌంటర్ అఫిడవిట్ లేకుండానే కేసు విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.

04/04/2018 - 01:13

బాన్సువాడ, ఏప్రిల్ 3: బాన్సువాడ మండలంలోని గౌలిగూడ ప్రాంతంలో మంగళవారం సినీ పక్కీలో చోరీ జరిగింది. అమాయక మహిళలను నమ్మించి మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించుకు పోయారు. ఈ సంఘటణపై బాన్సువాడ టౌన్ సీఐ. శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గౌలిగూడ ప్రాంతానికి చెందిన రుక్మిణీకి స్కీంలో ద్విచక్ర వాహనం డ్రాలో వచ్చిందని నమ్మబలికి అమెను షోరూంకు రావాల్సిందిగా సూచించారు.

04/04/2018 - 00:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని నిబంధనలు అమాయకులను భయాందోళనలకు గురిచేయకూడదని, వారి ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టంలోని కొన్ని నిబంధనలపై మార్చి 20న ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

04/03/2018 - 23:59

జి.కొండూరు, ఏప్రిల్ 3: దుప్పిని వధించి మాంసాన్ని విక్రయించే వ్యక్తిపై అటవీ శాఖాధికారులు కేసు నమోదు చేశారు. జి.కొండూరు ఎస్‌ఐ రాజేష్ ప్రత్యేక నిఘా ఉంచి దుప్పిని వేటాడిన వ్యక్తిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. దీంతో అటవీ శాఖాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారనే విషయం మరోసారి తేటతెల్లమైంది.

04/03/2018 - 23:21

సూర్యాపేట, ఏప్రిల్ 3: అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతిచెందిన సంఘటన మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చివ్వెంల మండలం గుంపుల గ్రామానికి చెందిన కొమ్ము కవిత (30) అనారోగ్యంతో ఉందని మంగళవారం తెల్లవారుజామున భర్త వెంకన్న ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

04/03/2018 - 22:34

పాన్‌గల్, ఏప్రిల్ 3: అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి పాన్‌గల్ మండల పరిధిలోని నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.

04/03/2018 - 22:22

జోగిపేట/గజ్వేల్, ఏప్రిల్ 3: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అందోల్ మండలం దానంపల్లి గ్రామశివారులో తుఫాన్ వాహనం అతివేగంగా వచ్చి చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో కడపల్ గ్రామానికి చెందిన అంబవ్వ(35), శంకరంపేట మండలం బూర్గుపల్లి చంద్రనాయక్ తండాకు చెందిన సర్దార్(33)లు మృతి చెందారు.

04/03/2018 - 03:26

కేసముద్రం, ఏప్రిల్ 2: పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థి గత నెల 31న సాయంత్రం ఇంట్లోంచి బయటకు వచ్చి ఫేస్ బుక్‌లో ‘గుడ్ బై’ అంటూ పోస్ట్ చేసి అదృశ్యమైన ఘటన కేసముద్రం మండలం కలువలలో చోటుచేసుకుంది. కొడుకు కోసం రెండు రోజులుగా గాలించినా ఫలితం లేకపోవడంతో సోమవారం తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఘటనకు సంబం ధించిన వివరాలిలా ఉన్నాయి.

04/03/2018 - 02:31

పెనమలూరు, ఏప్రిల్ 2: మండలంలోని కానూరు గ్రామంలో రామా ప్లాస్టిక్స్ కంపెనీ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం అరసవల్లి శివశంకర్(36) కానూరు నవత ట్రాన్స్‌పోర్టు రోడ్డులో నివాసముంటున్నాడు. శివశంకర్‌కి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని అనారోగ్యం వల్ల భార్య విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది.

Pages