S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/20/2019 - 23:31

న్యూఢిల్లీ, నవంబర్ 20: చట్టసభల్లో పోటీకి కనీస విద్యార్హత, వయో పరిమితిపై నిబంధనలు అవసరమని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కోట్టివేసింది. ‘పట్ట్భద్రులైనంత మాత్రాన జ్ఞానవంతులు కాదు.. ఉత్సాహానికి వయస్సుతో సంబంధం లేదు’ అంటూ ఈ కేసును ఉటంకిస్తూ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జ్ఞాన సముపార్జనకు పట్ట్భద్రులు లేదా పట్ట్భుద్రులు కాని వారు అంటూ ఉండదని..

11/20/2019 - 05:38

దంతాలపల్లి, నవంబర్ 19: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలపరిధిలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఐనాల శంకర్ తన భూమికి పాస్‌పుస్తకం రాలేదని మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై బానోత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరికుట్ల గ్రామానికి చెందిన ఐనాల శంకర్ 2012లో అదేగ్రామానికి చెందిన తండ విష్ణు వద్ద 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

11/20/2019 - 05:17

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 19: విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూలు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెరువులోకి దూసుకుపోయిన ఘటన మండల పరిధిలోని వాడపాలెం గ్రామంలో మంగళవారం సా యంత్రం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ హాని లేకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిన్నాపురంలోని కేరళ పబ్లిక్ స్కూలు బస్సు రోజు మాదిరిగా సాయంత్రం విద్యార్థులను ఎక్కించుకుని వాడపాలెం వెళుతుంది.

11/20/2019 - 05:17

ఉయ్యూరు, నవంబర్ 19: మండలంలోని కలవపాముల గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా నలుగురికి గాయాలైనాయి. రూరల్ పోలీసుల కథనం ప్రకారం గుడివాడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కార్తీకనోముల నిమిత్తం గన్నవరం వెళ్ళి తిరిగి వస్తుండగా కలవపాముల గ్రామం వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పి ప్రక్కనే ఉన్న కాల్వలోకి దూసుకు వెళ్ళింది.

11/20/2019 - 05:10

విజయవాడ (క్రైం), నవంబర్ 19: రాత్రి వేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

11/20/2019 - 05:06

ఖైరతాబాద్, నవంబర్ 19: వీఐపీలు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను పశ్చిమ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు.

11/20/2019 - 05:04

శేరిలింగంపల్లి, నవంబర్ 9: హాయిగా జీవనం సాగిస్తున్న కుటుంబంలో బామ్మర్ది చిచ్చు పెట్టడంతో బావ బలయ్యాడు. తన చెల్లెకు విడాకులు ఇవ్వాలని వేధించడంతో తీవ్ర ఆందోళనకు గురైన బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

11/20/2019 - 04:58

వికారాబాద్, నవంబర్ 19: రూ.4 వేలు లంచం తీసుకుంటూ వీఆర్‌ఓ ఏసీబీకి చిక్కిన సంఘటన నవాబుపేట్ మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబుపేట్ మండలం చిట్టిగిద్ద గ్రామానికి చెందిన పీ.రాములు మండల పరిధిలోని కొజ్జవనంపల్లి గ్రామ వీఆర్‌వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

11/20/2019 - 04:48

విజయవాడ (క్రైం), నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్‌లో భారీగా నిధులు దుర్వినియోగం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. ఈమేరకు అసోసియేషన్‌లో గత చాలాకాలంగా కీలక పాత్ర వహిస్తూ వస్తున్న కరణం పున్నయ్య చౌదరి ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

11/20/2019 - 01:25

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణలో బస్సు రూట్ల ప్రైవేటీకరణపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే అది తప్పు ఎలా అవుతుందని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఇబ్బంది ఏమిటి? భవిష్యత్‌లో వచ్చే సమస్యలను ముందే ఎందు కు ఊహిస్తారు? ఇంకా ప్రైవేటీకరణ జరగలేదు కదా? అని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది.

Pages