S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/16/2018 - 23:34

వినుకొండ, మార్చి 16: స్థానిక నరసరావుపేట రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవర అమరలింగం (45) విద్యుత్ ఏఈ మృతి చెందారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న మృతుడు వినుకొండకు సమీపంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు.

03/16/2018 - 23:30

యాడికి, మార్చి 16 : మండల పరిధిలోని చందన గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని పొలాల్లో వృద్ధుడి శవం లభ్యమైనట్లు ఎస్‌ఐ కత్తిశ్రీనివాసులు తెలిపారు. వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో సిబ్బందితో వెళ్లి శవాన్ని పరిశీలించినట్లు తెలిపారు.

03/16/2018 - 23:22

మేదరమెట్ల,మార్చి 16:జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారులపై కొరిశపాడు మండల పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయాలుపాలైన సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయరహదారిపై బొడ్డువానిపాలెం గ్రామ బస్టాండు సమీపంలో పార్సిల్ లారీ వెనుకనుండి ఢీకొనగా మోటారుసైకిలిస్టు మృతిచెందాడు.

03/16/2018 - 03:30

కేయూ క్యాంపస్ / నర్సంపేట, మార్చి 15: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జాతీయ రహదారిపై చింతగట్టు కెనాల్ క్యాంప్ వద్ద కేఎల్‌ఎన్ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఉన్న డివైడర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కక్కడే మృతి చెందారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్సై భీమేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

03/16/2018 - 02:43

కంభం, మార్చి 15: ఇతర ప్రాంతాల నుంచి గుట్కాలు కంభంకు తీసుకువస్తూ పట్టుబడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా పట్టంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంభం వైపు వెళ్తున్న ఆటోలో 11 బస్తాల్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. వీటి విలువ నాలుగు లక్షలు ఉంటందని పోలీసులు చెప్పారు.

03/16/2018 - 01:37

న్యూఢిల్లీ, మార్చి 15: భాజపా అధ్యక్షుడి తనయుడు జెయ్ షా, ‘ది వైర్’ అనే న్యూస్ పోర్టల్‌పై వేసిన పరువునష్టం దావాపై, ఏప్రిల్ 12 వరకు ముందుకు పోవద్దని గుజరాత్ ట్రైల్ కోర్టును గురువారం ఆదేశించింది. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియాను చీవాట్లు పెట్టింది. ‘‘తమకు తోచిన విధంగా’’ ఏ వ్యక్తిపైనైనా ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తారా? అంటూ ప్రశ్నించింది.

03/16/2018 - 00:56

కొత్తకోట, మార్చి 15: మదనాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని గురువారం ఉదయం ప్యాసింజర్ రైలు కింద పడి పాత్లావత్ శంకర్‌నాయక్ (26) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసు అధికారి రాఘవేందర్ తెలిపారు.

03/16/2018 - 00:14

న్యూఢిల్లీ, మార్చి 14: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కార్తి చిదంబరంకు మరికొన్ని రోజుల పాటు ఊరట లభించేలాగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేశాయి. ఈ కేసులో కార్తి చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 20వ తేదీ వరకు అరెస్టు చేయకూడదని ఢిల్లీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల వర్తింపును మార్చి 22వ తేదీ వరకు పొడిగించింది.

03/15/2018 - 23:33

గుత్తి, మార్చి 15 : స్థానిక గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సుబ్రమణ్యం (22) గురువారం మేడపై నుంచి పడి మృతి చెందాడు. మడకశిరకు చెందిన చలపతి కుమారుడు సుబ్రమణ్యం పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటూ పట్టణ శివార్లలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

03/15/2018 - 04:15

మడకశిర, మార్చి 14 : మండల పరిధిలోని మెళవాయి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ రఫిక్ (42) మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి కుటాగూళ్లకు చెందిన మహమ్మద్ రఫిక్ వివిధ ప్రాంతాల్లో చింతపండు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించి జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగా శిరా, అమరాపురం ప్రాంతాల్లో చింతపండు కొనుగోలు చేసి లారీలో విజయవాడకు తరలించారు.

Pages