S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/08/2019 - 05:16

కేసముద్రం, ఏప్రిల్ 7: ఆస్తికోసం కన్న తండ్రిని కొట్టి చంపిన కొడుకు ఉదంతం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికనె్న శివారు ముత్యాలమ్మతండాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సతీష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

04/08/2019 - 04:55

హైదరాబాద్, ఏప్రిల్ 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పోలీస్ తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు రూ.4.92 కోట్ల రూపాయలు టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అనుసరించి జంటనగరాల్లో నిఘా పెంచామన్నారు.

04/08/2019 - 04:23

హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు తమ విధానం ఏమిటో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈబీసీని అమలుచేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై మరీ ముఖ్యంగా నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా జరిగే ఎంబీబీఎస్, బీడీఎస్‌ల అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి పద్ధతిని అనుసరించబోతున్నారో తేల్చి చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

04/08/2019 - 03:22

నేరేడ్‌మెట్, ఏప్రిల్ 7: మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన వ్యక్తిని బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముషిరాబాద్ రామ్‌నగర్‌లో నివసించే సాయితేజ అలియాస్ సన్ని(27), ప్రైవేట్ ఉద్యోగి. మల్కాజిగిరి పీవీఎన్ కాలనీలో నివసించే అతని చెల్లెలి క్లాస్‌మెట్ యువతి(23)తో కొంత కాలం క్రితం పరిచయం పెంచుకున్నాడు.

04/08/2019 - 05:26

సిరిసిల్ల, ఏప్రిల్ 7: బతుకమ్మ చీరల ఉత్పత్తిలో బోగస్ పవర్‌లూం మ్యాక్స్ సొసైటీ వ్యవహారం, నాసిరకం నూలు వినియోగం ఉదంతాలపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈమేరకు గత వారం రోజులుగా మ్యాక్స్ సంఘాల ప్రతినిథులతో విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

04/07/2019 - 05:24

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 48,14,43,846 రూపాయల నగదు, ఇతర వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ ఇతర శాఖలు రోడ్లపై తనిఖీలు చేయడం ప్రారంభించాయి. అక్రమంగా ఎక్కడైనా, ఎవరైనా నగదు, ఇతరత్రా వస్తువులు దాచి ఉన్నట్టు సమాచారం అందితే మెరుపుదాడులు చేస్తున్నారు.

04/07/2019 - 04:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన డిఫెన్స్ ఏజెంట్ సుశేన్ మోహన్ గుప్తా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై స్పందనను తెలియజేయాల్సిందిగా ఢిల్లీలోని ఓ కోర్టు శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశించింది. రూ. 3,600 కోట్ల విలువ గల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో ఈడీ సుశేన్ మోహన్ గుప్తాను అరెస్టు చేసింది.

04/07/2019 - 04:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్ భవనాన్ని ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది.

04/07/2019 - 01:52

జీడిమెట్ల, ఏప్రిల్ 6: దాచుకున్న డబ్బులు ఇవ్వనందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించి విషం సేవించిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్పనగర్‌లో నివాసముండే చితనూర్ మల్లికార్జున్ (26) స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగరాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

04/06/2019 - 00:08

కేసముద్రం, ఏప్రిల్ 5: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో గురువారం రాత్రి శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య అనూష (22)ను ఇంట్లోని రేకుల పైకప్పు పైపునకు ఉరేసి చంపినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. మృతురాలి తండ్రి సామేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎస్‌ఐ కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన శ్రీకాంత్, అనూష వేర్వేరు కులాలకు చెందినవారు.

Pages