S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/31/2019 - 04:21

హైదరాబాద్, జూలై 30: దోమల్‌గూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్ చేశారని, తెలిసిన వారే ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

07/31/2019 - 04:18

హైదరాబాద్/ హయత్‌నగర్ జూలై 30: బీఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ మిస్టరీ వీడింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగర్‌లో అపహరణకు గురైన యువతి ఆచూకీ తెలియడంతో రాచకొండ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హయత్‌నగర్‌లో ఈనెల 23న కిడ్నాపైన సోనీ ఆచూకీ ప్రకాశం జిల్లా అద్దంకిలో దొరికింది. పలు కేసుల్లో నిందితుడైన కిడ్నాపర్ రవిశేఖర్.. ఆమెను అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది.

07/31/2019 - 01:08

అమరావతి, జూలై 30: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

07/30/2019 - 23:18

మరిపెడ, జులై 30: పట్టపగలే పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రథమ చిక్సిత కేంద్రంలో అతికిరాతకంగా భార్యను గొంతు కోసి హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త లొంగిపోయిన సంఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

07/31/2019 - 05:30

గంట్యాడ: అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారుల వలలో మంగళవారం గంట్యాడ తహశీల్దార్ చిక్కుకున్నారు. గంట్యాడ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం జరిపిన ఏసీబీ మెరుపుదాడులతో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఏసీబీ అధికారుల వలలో ఈసారి పెద్ద తిమిలింగమే చిక్కింది. నో-అబ్జెక్షన్ సర్ట్ఫికెట్ కోసం ఓ వ్యక్తి నుంచి 50వేలు రూపాయలు లంచం తీసుకుంటున్న తహశీల్ధార్ డి.శేఖర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

07/30/2019 - 22:59

నెల్లూరు రూరల్, జూలై 30: మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును మంగళవారం నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టుచేశారు.

07/30/2019 - 04:34

వరంగల్, జూలై 29: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సల్స్‌ను సోమవారం వరంగల్ కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల నుండి లక్షా 65 వేల రూపాయలతో పాటు, బొమ్మతుపాకి, 16 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, కత్తిపెన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

07/30/2019 - 02:01

మచిలీపట్నం, జూలై 29: రైస్ పుల్లింగ్, బంగారాన్ని తక్కువ రేటుకు అమ్ముతామని ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరుపరిచారు. సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ వివరించారు.

07/30/2019 - 01:50

గచ్చిబౌలి, జూలై 29: హైటెక్ సిటీని ఆనుకుని ఉన్న 100 గజాల స్థలం ఐదు లక్షలకే.. నడుచుకుంటూ హైటెక్ సిటీకి వెళ్లవచ్చు అంటూ గత దశాబ్ద కాలం నుంచి పేద, మధ్య తరగతి ప్రజలను మోసం చేస్తు కోట్ల రూపాయలు మోసం చేసిన ముఠాలో 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గ సీఐ రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/30/2019 - 00:46

చేబ్రోలు : కట్టుదిట్టమైన భద్రతతో ఉండే గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో భారీ దొంగతనం జరిగింది. రూ.44 లక్షలకు పైగా సొమ్మును చోరులు అపహరించారు. ఇంత పెద్దమొత్తంలో నగదు దోచుకెళ్లడంతో డెయిరీ యాజమాన్యం, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం మేరకు... వడ్లమూడి సంగం డెయిరీలోని మొదటి అంతస్తులోని క్యాష్ కౌంటర్ గదిలోని బీరువాలో 70 లక్షలకు పైగా నగదు ఉంది.

Pages