S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/24/2018 - 00:12

సీతానగరం, ఫిబ్రవరి 23: చెడు వ్యసనాలకు బానిసైన భర్త భార్యను ఆస్తి కోసం కడతేర్చిన హృదయవిదారక సంఘటన మండలంలోని జగ్గునాయుడుపేట (ఆర్.వెంకంపేట) గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించి మృతురాలి తండ్రి సీతానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ సాయికృష్ణ వివరాల ప్రకారం ఆర్.వెంకంపేట గ్రామానికి గులిపల్లి ఈశ్వరరావు, సత్యవతిలకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

02/24/2018 - 00:07

ఏలూరు, ఫిబ్రవరి 23: ఏలూరు పరిసర ప్రాంతాల్లో నిషేధించిన గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డిఎస్పీ కె ఈశ్వరరావు తెలిపారు. స్ధానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈవివరాలు తెలిపారు.

02/23/2018 - 22:54

కడప క్రైం,్ఫబ్రవరి 23: రూపాయ వడ్డీతో రుణాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసగించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ మాసూంబాషా తెలిపారు. శుక్రవారం సాయంత్రం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన అరెస్టు చేసిన పాత్రికేయుల ముందు ప్రవేశపెట్టారు. అసలు వ్యక్తి క్రాంతికుమార్, అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

02/23/2018 - 22:45

గుంతకల్లు, ఫిబ్రవరి 23 : పట్టణ శివారు ప్రాంతంలోని జీ.కొట్టాల వద్ద హంద్రీనీవా కాలువలో ఎస్.మోహన్(25) శుక్రవారం గల్లంతైనట్లు మిత్రులు తెలిపారు. భాగ్యనగర్‌కు చెందిన మోహన్ మిత్రులతో కలసి ఈతకు వెళ్లాడు. దీంతో ఈత కొడుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది, రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

02/23/2018 - 03:50

తూప్రాన్, ఫిబ్రవరి 22: ఏడాది వయస్సున్న కూతురిని వదిలి ఒక జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలి పిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం (38) తన తమ్ముడు దుబాయికి వెళ్లడంతో తమ్ముడి భార్య దేవేంద్ర (32)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

02/23/2018 - 03:45

ఆదిలాబాద్: ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో ఆదిలాబాద్ మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ పి.కొండల్‌రావు ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆదిలాబాద్, కరీంనగర్, కొత్తగూడెంలో ఏకకాలంలో జరిపిన దాడుల్లో సుమారు రూ.8కోట్ల విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డట్టు ఏసిబి అధికారులు తెలిపారు.

02/23/2018 - 03:27

ముంబయి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బకాయిల చెల్లింపునకు పటిష్ట, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనతో ముందుకు రావాలని ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు లేఖ రాసిన నేపథ్యంలో ఈడీ చర్యలు ఊపందుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో దర్యాప్తు ఉధృతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఈ కేసులో ప్రధాన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

02/23/2018 - 03:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఒక మహిళ వివాహాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమేనా, అందుకు మీకున్న అధికారాలు ఏమిటో పరిశీలించారా అని కేరళ హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

02/23/2018 - 03:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపకాలు చేసేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురువారం విచారణ ప్రారంభించింది. వ్యవసాయ రంగంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ తరపు న్యాయవాది క్రాస్ ఎగ్జామ్ చేశారు.

02/23/2018 - 03:23

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఇందూటెక్ జోన్ పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో మారిషస్ ప్రభుత్వం ఇండియాను అంతర్జాతీయ కోర్టుకు లాగింది.

Pages