S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/20/2018 - 22:28

మడకశిర, ఫిబ్రవరి 20 : నాలుగు అడుగుల స్థలం తనకు ఇవ్వలేదని అన్న తమ్ముడిని వేటకొడవలితో నరికి చంపిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అమిదాలగొంది పంచాయతీ టీడీపల్లికి చెందిన రంగధామప్పకు ప్రభుత్వం మరుగుదొడ్డి మంజూరు చేసింది. అయితే మరుగుదొడ్డి నిర్మాణానికి అవసరమైన స్థలం లేకపోవడంతో తమ్ముడు రంగస్వామి (48) స్థలంలో మరుగుదొడ్డి నిర్మించాలని భావించాడు.

02/20/2018 - 22:27

పెనుకొండ, ఫిబ్రవరి 20 : పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మడకశిర రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రొద్దం మండలం మరవపల్లికి చెందిన జే.నారాయణరెడ్డి (45) మృతి చెందారు. పెనుకొండ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న స్కార్పియో ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

02/20/2018 - 22:27

గుడిబండ, ఫిబ్రవరి 20 : మండల పరిధిలోని ఎస్‌ఎస్ గుండ్లుకు చెందిన అన్నపూర్ణ (24) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నాటక మధుగిరికి చెందిన అన్నపూర్ణకు ఎస్‌ఎస్‌గుండ్లుకు చెందిన ఈశ్వరప్పతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే అన్నపూర్ణకు సంతానం కలుగలేదు. దీంతో మనస్తాపానికి గురై చెంది సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

02/20/2018 - 03:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కేంద్ర ఎన్నికల సంఘంలోని చీఫ్ ఎన్నికల కమిషనర్‌తోపాటు మిగతా ఇద్దరు కమిషనర్లకూ పూర్తి అధికారాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కేంద్రం, ఈసీకి నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖన్వికర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం కేంద్రం, ఈసీకి నాలుగువారాల గడువిచ్చింది.

02/20/2018 - 03:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఎన్నికల్లో నకిలీ, బోగస్ ఓట్లను నిరోధించేందుకు ఆధార్ బేస్డ్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను నాలుగు వారాల తరువాత విచారిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ వేశారు.

02/20/2018 - 02:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త కథనం ద్వారా పరువు నష్టం కల్గించారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో ఇదే పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేయగా తోసిపుచ్చింది.

02/19/2018 - 23:43

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఉత్తర తెలంగాణలో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కీలక సూత్రధారిపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ పిడి చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇలాంటి మరికొందరిని ఇప్పటికే గుర్తించిన ఆ శాఖ త్వరలో వారిపైనా పిడి చట్టం కింద కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ సోమవారం వెల్లడించారు.

02/19/2018 - 23:42

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బ్యాంక్ అక్కౌంట్ల నుంచి ఆ ఖాతాదారులకు తెలియకుండా నగదు బదిలీ చేసి చోరీ చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన సుభాష్‌కుమార్, మనోజ్‌కుమార్ బాల్ అనే ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/19/2018 - 23:40

హైదరాబాద్, ఫిబ్రవరి 19: అవినీతి కేసులో నిందిత అధికారికి ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమాన విధించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఎసిబి డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ల్యాండ్ రికార్డ్సు విభాగంలో పని చేసే డిప్యూటీ సర్వేయర్ ఎడ్ల పోచయ్య రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు.

02/19/2018 - 23:36

హైదరాబాద్, ఫిబ్రవరి 19: కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వైద్యులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల రిక్రూట్‌మెంట్‌లో వెయిటేజీ ఇస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసిన కాలానికి ఈ వెయిటేజీ ఇస్తామని అన్నారు.

Pages