S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/06/2019 - 03:17

అద్దంకి, ఫిబ్రవరి 5: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ రైతులను నమ్మించి నట్టేట ముంచిన తులసి పంట కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసిన తదుపరి, మంగళవారంనాడు అద్దంకి ఉద్యానవనశాఖాధికారి నవీన్‌ను అద్దంకి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా, కోర్టు రిమాండ్ విధించింది.

02/06/2019 - 02:56

హైదరాబాద్, ఫిబ్రవరి 5: సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుపై రెండు రాష్ట్రాల ప్రజల దృష్టి పడింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డి చంపాడని ఏపీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన విషయం విదితమే.

02/06/2019 - 02:45

పాతబస్తీ, ఫిబ్రవరి 5: నగర టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం ఒక కారును అటకాయించి దానిలోని 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు, గంజాయి, ఇద్దరు నిందితులను కొత్తపేట పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం నర్సీపట్నం నుండి హైదరాబాద్‌కి కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది కొత్తూరు తాడేపల్లి రోడ్డులోని వైవీ రావు ఎస్టేట్ సర్కిల్ వద్ద అటకాయించారు.

02/06/2019 - 02:45

పాతబస్తీ, ఫిబ్రవరి 5: చెడు అలవాట్లు మానుకుని బుద్ధిగా కాపురం చేసుకోవాలని అత్త మందలించిందని కక్ష పెంచుకున్న అల్లుడు పథకం ప్రకారమే హతమార్చాడని, ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని కొత్తపేట సీఐ ఎండీ ఉమర్ తెలిపారు. మంగళవారం కొత్తపేట పోలీసు స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 29న షేక్ కరీమా హత్యకు గురైన విషయం తెలిసిందే.

02/06/2019 - 02:43

చందర్లపాడు, ఫిబ్రవరి 5: మండలంలోని రామన్నపేట నుండి గుంటూరు జిల్లా అచ్చంపేట మధ్య తిరిగే బల్లకట్టు మంగళవారం నది ఒడ్డునే కృష్ణానదిలో మునిగింది. ఒక లారీ, రెండు ఆటోలు నదిలో మునిగిపోయాయి. ఆ సమయంలో 20మంది ప్రయాణీకులు ఉన్నారు. బల్లకట్టు బయలుదేరకముందే నది ఒడ్డునే నీటిలోకి వరిగి పోవడంతో ప్రయాణీకులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణీకులు అందరూ క్షేమంగా బయటపడ్డారు.

02/06/2019 - 02:34

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 5: దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వౌలాలిలో నివసించే ఎండీ నదీమ్(34), సఫిల్‌గూడలో నివసించే సాయి వెంకట్(20), చర్లపల్లిలో నివసించే కొండ మధు(23), వినోద్ కుమార్(24) స్నేహితులు.

02/06/2019 - 02:33

ఖైరతాబాద్, ఫిబ్రవరి 5: తనను దుర్భాషలాడటమేకాక దురుసుగా ప్రవర్తించిన గుణశేఖర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జూబ్లిహిల్స్ పోలీసులకు కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు.

02/06/2019 - 02:32

షాబాద్, ఫిబ్రవరి 5: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన సంఘటన చేవెళ్ల పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ గురువయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం - మండల పరిధిలోని సంకెపల్లిగూడ గ్రామ శివారులోని భారత్ గ్యాస్ గోదాంలో 2017 సంవత్సరంలో అర్థరాత్రి భారత్ గ్యాస్ గోదాం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 137 గ్యాస్ సిలిండర్లు దొంగిలించుకొని పోయారు.

02/06/2019 - 02:23

వనస్థలిపురం, ఫిబ్రవరి 5: నకిలీ నోట్లను తయారుచేసి మార్కెట్‌లో చెలామణి చేస్తున్న దొంగ నోట్ల ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద 31లక్షల 25వేల నకిలీ ఐదు వందలు, రెండువేల నోట్లు, కారు, ప్రింటర్, స్కానర్, ప్రింటింగ్ మెటీరియల్, ఏడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

02/06/2019 - 02:22

జీడిమెట్ల, ఫిబ్రవరి 5: బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్, గుర్రంగూడకి చెందిన జంగయ్య కుమారుడు బొల్లు సాయి గణేశ్ (23) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి వాజ్‌పేయ్‌నగర్ ఉంటున్నాడు.

Pages