S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/04/2019 - 00:54

ఖమ్మం, ఆగస్టు 3: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున పోలీసులు భారీ ఎన్‌కౌంటర్ చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోట అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న రిజర్వు పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

08/04/2019 - 00:52

శ్రీనగర్ : జమ్మూ-కాశ్మీర్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడుతుండడాన్ని నిరోధించడం భారత సైనిక దళాలకు సవాల్‌గా పరిణమించింది. ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరి వేస్తున్నా, పుట్టుకుని వస్తూనే ఉండడంతో స్థానికంగా ఉద్రిక్తత, ప్రజల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి.

08/03/2019 - 23:29

కైకలూరు, ఆగస్టు 3: పట్టణంలోని సీతయ్య హోటల్ బయట పార్క్ చేసి టిఫిన్ చేసేందుకు వెళ్లగా బైక్ పోయిన సంఘటనతో మోటారు సైకిళ్ళ దొంగను పట్టుకుని 17 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న బైక్‌లను, దొంగలను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

08/03/2019 - 00:25

న్యూఢిల్లీ, ఆగస్టు 2: తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ తాజాగా అమల్లోకి వచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. కేరళలోని సున్నీ ముస్లిం మేధావులు, మత నాయకులతో కూడిన సంస్థా కేరళ జమాయిత్-ఉల్-ఉలేమా ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని తన పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరింది.

08/03/2019 - 00:21

కరీంనగర్, ఆగస్టు 2:ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. గత నెల 23న కరీంనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు సీపీకి ఫిర్యాదు చేశారు.

08/03/2019 - 00:18

హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 2: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో లెక్చరర్ దంపతులు మృతి చెందిన సంఘటన కరీం నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి శివారులో శుక్రవారం ఉదయం వరంగల్ - కరీంనగర్ స్టేట్ హైవేపై కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో లెక్చరర్ దంపతులు దుర్మరణం పాలయ్యారు.

08/02/2019 - 23:53

హైదరాబాద్, ఆగస్టు 2: భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన న్యూ డెమోక్రసీ సభ్యుడు లింగన్న మృతదేహానికి వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. జూలై 31వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన లింగన్న మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున నలుగు గంటలకు కొత్తగూడెం నుంచి నగరంలోని గాంధీ అసుపత్రికి తీసుకువచ్చారు.

08/02/2019 - 23:53

హైదరాబాద్ / శంషాబాద్, ఆగస్టు 2: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. తమ బిడ్డలను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా, తల్లిదండ్రులు కిడ్నాపర్‌ను వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబై నుంచి శ్రీనాథ్ కుంటుంబ సభ్యులు ఉదయం శంషాబాద్ చేరుకున్నారు.

08/02/2019 - 23:52

విజయవాడ (క్రైం), జూలై 2: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎయిడ్స్ ఖైదీలకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని 27 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకిందనే సమాచారంపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు ఇందుకు సంబంధించి శుక్రవారం విచారణ నిర్వహించింది. జైలుకు రాకముందే ఎయిడ్స్ ఉందా..

08/02/2019 - 23:47

విజయవాడ, ఆగస్టు 2: గత ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమలైన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో కోట్లాది రూపాయల మేర అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్టుగా ఒకదాని వెంట మరొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూనే ముందుగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణం నిలిపివేస్తోంది.

Pages