S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/02/2019 - 00:46

సిరిసిల్ల, ఫిబ్రవరి 1: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో నేత కార్మికుడు కొండ్ల శ్రీనివాస్ (40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక టెక్స్‌టైల్ పార్కులో పవర్‌లూం కార్మికుడిగా పని చేస్తున్న శ్రీనివాస్ మెదడులో ప్రాణాంతక వ్యాధి సంక్రమించడంతో అప్పుల పాలై, చివరికి శుక్రవారం సాయంత్రం తన కాలనీలోని తన ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణం పాందాడు.

02/02/2019 - 00:37

నందిగామ, ఫిబ్రవరి 1: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎక్స్‌ప్రెస్ టీవీ వ్యవస్థాపకుడు చిగురుపాటి జయరామ్ గురువారం కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జాతీయ రహదారిపై ఐతవరం సమీపంలో కారులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు హైదరాబాదులో స్థిరపడ్డ చిగురుపాటి జయరాంగా గుర్తించారు.

02/02/2019 - 00:32

హైదరాబాద్, ఫిబ్రవరి 1: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం నాడు గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్ళి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో వేం నరేందర్‌రెడ్డి తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు.

02/01/2019 - 22:39

శ్రీకాకుళం, ఫిబ్రవరి 1: గుజరాత్ రాష్ట్రం వీరావల్ సముద్ర తీరంలో పాకిస్తాన్ కోస్టుగార్డుకి చిక్కి అక్కడి జైల్లో మగ్గిపోతున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాసారు. జిల్లా మత్స్యకారులు కరాచీలోని రండీ జైలులో బందీలుగా ఉన్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 27న బందీలుగా చిక్కిన రాష్ట్రానికి చెందిన 22 మంది మత్స్యకారులు జైల్లోనే మగ్గుతున్నారు.

02/01/2019 - 22:27

అద్దంకి, ఫిబ్రవరి 1: విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయిని, విద్యార్థినులపై దాడి చేసి అమానుషంగా కొట్టడంతో ఇద్దరు పిల్లలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయన్న సంగతి వెలుగులోకి వచ్చింది.

02/01/2019 - 04:59

బెజ్జూర్, జనవరి 31: కుమ్రంభీం జిల్లా కౌటాల మండలం తలోడి వి ఆర్ ఓ లంఛం తీసుకుంటూ ఏసిబి అధికారులకు గురువారం పట్టుబడ్డారు. ఏసిబి డి ఎస్పీ ప్రతాప్, సీఐ లు రవీందర్, ప్రశాంత్‌లు తెలిపిన వివరాల ప్రకారం గురువారం కౌటాల మండలం తలోడి వీఆర్‌ఓ దుర్గయ్య తలోడి గ్రామానికి చెందిన శ్యాం రావు అనే రైతు వద్ద రూ.5 వేలు లంఛం తీసుకుంటుండగా, పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

02/01/2019 - 04:58

నల్లగొండ రూరల్, జనవరి 31: జిల్లా కేంద్రమైన నల్లగొండ వద్ద పానగల్లు ఉదయ సముద్రం చెరువులో ఇద్దరు విద్యార్థినులు గల్లంతైన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, విద్యార్థినిల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరుకు చెందిన తిగుల్ల శ్రావణి హైదరాబాద్‌లో కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

02/01/2019 - 04:53

కామారెడ్డి, జనవరి 31: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల క్రితం గోపిఅనే న్యాయవాదిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ డి.కృష్ణకు కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి ఆరు నెలల జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. న్యాయవాది గోపి అందిచిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/01/2019 - 04:27

కాకినాడ సిటీ, జనవరి 31: సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనను కొంతమంది వేధిస్తున్నారంటూ తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు ఒకరు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

02/01/2019 - 01:38

న్యూఢిల్లీ, జనవరి 31: సుప్రీంకోర్టు శబరిమల ఆలయ కేసు విచారణను వచ్చే వారం ప్రారంభించనుంది. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయసులో ఉన్న బాలికలు, మహిళలను సయితం అనుమతిస్తూ సెప్టెంబర్ నెలలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను అది విచారించనుంది. సుమారు 48 రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Pages