S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/11/2019 - 05:32

కోడేరు, నవంబర్ 10: నెలరోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన కే.సత్యంరెడ్డి అనే డ్రైవర్ ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న సెల్‌టవర్ ఎక్కి ఉరివేసుకొని అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

11/11/2019 - 04:56

విశాఖపట్నం, శ్రీకాకుళం, నవంబర్ 10: విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాద ఘటనల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. రైలు ప్రమాదంలో భార్యాభర్తలు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వంటవారు, చేపల వేటలో ఒకరు, కళింగపట్నం సాగర తీరంలో స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఆయా ఘటనలకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

11/11/2019 - 04:41

మెదక్ రూరల్, నవంబర్ 10: పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి రెండు దుప్పులు హతమయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేళీఘణాపూర్ మండలం గాజిరెడ్డిపల్లి శివారులో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. అటవీ అధికారుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బీమయ్య భూమిని అదే గ్రామానికి చెందిన మంద వెంకయ్య కౌలు చేస్తున్నాడు.

11/11/2019 - 04:51

కోడేరు, నవంబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ నిర్లక్ష్యం వైఖరి కారణంగా మరో రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం నాగర్‌కర్నూల్ జిల్లాలలో కలకలం సృష్టించింది. కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి తండాకు చెందిన రాత్లావత్ బాలు (45) అనే రైతు అనుమానస్పద స్థితిలో ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో మృతి చెందాడు.

11/11/2019 - 04:30

అమ్రాబాద్, నవంబర్ 10: మిరప చేనుకు గంజాయ ఘాటు తగిలింది. మిరపఘాట్‌లో గంజాయ ఘాటును ఎవరూ పసికట్టలేరను కున్నారో ఏమో మిరప పంటలో గంజాయని సాగు చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

11/11/2019 - 04:28

వెల్దండ, నవంబర్ 10: సెలవు దినం కావడంలో మిత్రులంతా దైవ దర్శనంతో పాటు ఆహ్లాదంగా, ఉత్సాహంగా గడిపేందుకు శ్రీశైలం వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి సమీపంలో అదివారం రాత్రి చోటు చేసుకుంది.

11/11/2019 - 04:24

వనపర్తి, నవంబర్ 10: వనపర్తి జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్ల మధ్య గల భీమాకాలువలో ఆదివారం ఉదయం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైద్రాబాద్‌లో నివాసముంటున్న అంజయ్య, రామకృష్ణ సాగర్, నవీన్ అనే యువకులు శనివారం కడుకుంట్లలో జరిగే ఒక శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చారు.

11/11/2019 - 01:55

కపిలేశ్వరపురం, నవంబర్ 10: ఇసుక సంక్షోభం మరో భవన నిర్మాణ కార్మికుడిని మింగేసింది. ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిరాల ధనరాజు (34) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

11/11/2019 - 01:50

ఇబ్రహీంపట్నం, నవంబర్ 10: జాతీయ రహదారి గాజులపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం ద్విచక్ర వాహనం మీద ప్రసాద్ అతని మేనల్లుడు హితేష్‌తో కలిసి ఇబ్రహీంపట్నం వస్తుండగా పశ్చిమ ఇబ్రహీంపట్నం గాజులపేట వద్ద తెలంగాణాకు చెందిన ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్‌ను ఢీకొంది.

11/11/2019 - 01:43

కంకిపాడు, నవంబర్ 10: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోని అదుపులోకి తీసుకున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన డిపో నెం.27షాపు డీలర్ నుంచి ఆటోలో 10బస్తాల బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలో స్థానికులు ఆటోని ఆపి సంబంధిత అధికార్లకు సమాచారం అందించారు.

Pages